కాల గమనంలో 2022 సంవత్సరం కూడా ముగియబోతుంది.ఎన్నో అంచనాలతో ప్రారంభం అయినా 2022 సంవత్సరం ఎప్పటి మాదిరిగానే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా ముగిసి పోయింది.
మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది.పాత సంవత్సరంలో ఎన్నో మధురానుభూతులు ఉంటాయి.2021 సంవత్సరం చివర్లో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు అఖండ మరియు పుష్ప సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఆ రెండు సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
డిసెంబర్ నెల లో సినిమాలు రావడం చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది.
మరి కొన్ని రోజుల్లో సంక్రాంతి సీజన్ ఉంటుంది.
కనుక డిసెంబర్ లో సినిమా లు చూసేందుకు ప్రేక్షకుల ఆసక్తి చూపించరేమో అనే ఉద్దేశం తో పెద్ద హీరోలు తమ సినిమా లను విడుదల చేయరు.కానీ గత సంవత్సరం నందమూరి బాలకృష్ణ తన అఖండ సినిమా ని విడుదల చేయడం జరిగింది.
అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అంతే కాకుండా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ రెండు సినిమా లు గత ఏడాదికి డీసెంట్ ముగింపు పలకడం జరిగింది.ఇక ఈ సంవత్సరం డిసెంబర్ లో కూడా డీసెంట్ సక్సెస్ దక్కింది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా క్రిస్మస్ కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ధమాకా సినిమా ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా సమాచారం అందుతుంది.ఈ లాంగ్ వీకెండ్ లో కచ్చితంగా 100 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.సంక్రాంతి సినిమా లు వచ్చే వరకు పెద్ద సినిమాల జోరు లేదు.
కనుక అప్పటి వరకు ధమాకా సినిమా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.మొత్తానికి 2022 సంవత్సరంలో చివరగా ఒక మంచి ముగింపు దక్కినట్లు అయిందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.







