Mann Ki Baat@100 : ప్రధాని నరేంద్ర మోడీ ‘‘మన్‌కీబాత్‌’’కి అమెరికాలో అరుదైన గౌరవం

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) తనదైన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన తీసుకొచ్చిన కార్యక్రమం ‘‘మన్‌కీబాత్’’( Mankeebaat ).

ప్రతి నెలా చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రధాని దేశ ప్రజలకు చేరువయ్యారు.రాజకీయాలతో పాటు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జరిగే అంశాలను ప్రస్తావిస్తూ .ఎంతో మందికి మోడీ గుర్తింపు తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో నిన్న ‘‘మన్‌కీబాత్’’ 100వ ఎపిసోడ్ ప్రసారమైంది.దీనికి గుర్తుగా భారత ప్రభుత్వం రూ.100 కాయిన్‌ను కూడా విడుదల చేయనుంది.

ఇదిలావుండగా.మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి అరుదైన గౌరవం దక్కింది.అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ( New York, New Jersey, USA ) రాష్ట్రాలు మన్‌కీబాత్‌ను గౌరవిస్తూ ప్రత్యేక తీర్మానాలు చేశాయి.

మంచి పాలనను ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ఒక సాధనంగా మారిందని ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు కొనియాడాయి.ఏప్రిల్ 30న మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్‌ను జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.

Advertisement

ఏప్రిల్ 26న న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ, సెనేట్‌లు తీర్మానాలను ఆమోదించాయి.సెనేట్‌లో ఈ తీర్మానాన్ని భారత సంతతికి చెందిన సెనేటర్ కెవిన్ థామస్.

అసెంబ్లీలో ఇండో అమెరికన్ మహిళ జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు( Jennifer Rajkumar ) ప్రవేశపెట్టారు.న్యూయార్క్‌లో వున్న భారతీయ కమ్యూనిటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రోతలతో నేరుగా ప్రసంగించడానికి, వారితో తన ఆలోచనలను పంచుకోవడానికి మోడీకి మన్‌కీబాత్ ప్రత్యేక వేదికగా మారిందని తీర్మానంలో ప్రస్తావించారు.

ఇక న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీలో భారత సంతతికి చెందిన సభ్యుడు రాజ్ ముఖర్జీ ( Raj Mukherjee )తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అలాగే ఎడిసన్ నగర మేయర్ సామ్ జోషి కూడా తీర్మానాన్ని సమర్పించారు.ఈ తీర్మానాలను భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు సమర్పించారు.ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో న్యూజెర్సీలోని ఇండియన్ కమ్యూనిటీ కోసం మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు.

కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు