ఈజిప్టు మమ్మీలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీటికి సంబంధించినంత వరకు ఏదో ఒక వార్త నెట్టింట్లో బాగా పాపులర్ అవుతూనే ఉంటుంది.
మొన్నటికి మొన్న ఓ మమ్మీని ఇలాగే బయటకు తీస్తే ఆ వార్త కూడా బాగానే వైరల్ అయిపోయింది.అయితే మమ్మీలను పూర్వపు కాలంలో అనగా రాజుల కాలంలో ఆ ఈజిప్టు దేశంలోని సైనికులు పిరమిడ్ల రూపంలో చనిపోయిన వారిని ఇలా పెట్టిన సంగతి తెలిసిందే.
ఆ శవాలు పాడైపోకుండా ఇలా అత్యంత నియమ నిబంధనలు పాటించి భద్ర పరిచారు.
కాగా ఇప్పుడు కూడా ఓ మమ్మీకి సంబంధించిన వార్త నెట్టింట్లో బాగా పాపులర్ అవుతోంది.
అయితే ఇంత వరకు మమ్మీల గురించి, వారి శరీరం మీద పాడై పోకుండా ఉన్న వస్తువుల గురించి మాత్రమే తెలుసుకున్నాం.మొదటిసారి ఓ మమ్మీ కడుపులో ఉన్న పిండం బయట పడింది.
వార్సా యూనివర్సిటీ సైంటిస్టులు ఈ విషయాన్ని వివరించారు.మమ్మీని సీటీ ఎక్స్ రే స్కాన్ సాయంతో పూర్తిగా పరిశీలించగా.
అందులో ఉన్న పుట్టబోయే బిడ్డ అవశేషాలు బయట పడ్డాయి.వాటిని చాలా క్లియర్ గా గుర్తించామని ఆయన వివరించారు.

అయితే ఈ మమ్మీ తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయిందని వెల్లడించారు.దీనికి ‘మిస్టిరియస్ లేడీ’ అని పేరు పెట్టారు.కాగా ఆ మహిళ ప్రసవ సమయంలో చనిపోలేదని, అంతకు ముందే చనిపోయినట్టు వెల్లడించారు.కారణాలు ఏమో తెలియట్లేదని, ఇక ఆ మమ్మీ సమాధి కూడా పూర్తిగా శిథిలమైందన్నారు.
ఇక ఆమె కడుపులో ఉన్న పిండం 30 వారాలు నిండినట్టు తెలుస్తోంది.కాగా మమ్మీకి పూసిన అనేక రసాయనాల వల్ల ఆమె కడుపులో ఉన్న పిండం ఎముకలు చితికిపోయినట్టు తెలిపారు సైంటిస్టులు.
ఈ వార్త బాగా పాపులర్ అవుతోంది.