రిపబ్లికన్ డిబేట్‌లో తొలిసారిగా తలపడ్డ భారత సంతతి అభ్యర్ధులు.. నిక్కీ, వివేక్ మధ్య వాగ్వాదం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .

 In A First, 2 Indian-origin Candidates Clash In Us Republican Presidential Debat-TeluguStop.com

ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు( Indians ) క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.

Telugu Donald Trump, Hirshvardhan, Joe Biden, Nikki Haley, Presidential, Vivek R

ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్‌, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు( Indo Americans ) అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.

2024 అధ్యక్ష ఎన్నికల్లో భారత మూలాలున్న వ్యక్తులు నేరుగా తలపడుతున్నారు.ఇప్పటికే వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ), నిక్కీహేలీలు పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

వీరితో పాటు వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన హర్షవర్థన్ సింగ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.వీరు ముగ్గురు రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడం విశేషం.వీరిలో నిక్కీ హేలీ, వివేక్ రామస్వామిలపైనే ప్రస్తుతం అందరి దృష్టి వుంది.

తాజాగా జరిగిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌( First Republican Presidential Debate )లో వివేక్ రామస్వామి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Former President Donald trump ) గైర్హాజరు కాగా.ఎనిమిది మంది రిపబ్లికన్ అభ్యర్ధులు విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో రెండు గంటల పాటు తలపడ్డారు.

ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్ , వాతావరణ మార్పులపై చేసిన వ్యాఖ్యలతో వివేక్ చాలా మంది దృష్టిని ఆకర్షించారు.అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న వివేక్ రామస్వామి తన వాగ్ధాటితో ప్రత్యర్ధులను సులభంగా కట్టడి చేస్తున్నారు.

Telugu Donald Trump, Hirshvardhan, Joe Biden, Nikki Haley, Presidential, Vivek R

అయితే నిక్కీ( Nikki Haley ), వివేక్‌లు మాత్రం తొలి డిబేట్‌లో కత్తులు దూసుకున్నారు.30 సెకన్ల పాటు బిగ్గరగా అరుస్తూ.వేళ్లూ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లారు.విదేశాంగ విధానాలపై వివేక్‌కు అవగాహన లేదని నిక్కీ పదునైన విమర్శలు చేశారు.ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించాలని ఆయన చెబుతున్నారని.తైవాన్‌( Taiwan )ను చైనా మింగేయాలని , ఇజ్రాయెల్‌కు సాయం ఆపేయాలని అంటున్నారని మిత్రదేశాల పట్ల ఇలాంటి వైఖరి మంచిది కాదని నిక్కీ హేలీ అన్నారు.

అయితే ఆమె వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు వివేక్ రామస్వామి.ఉక్రెయిన్‌( Ukraine )కు అమెరికా అధిక సాయం అందించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.రక్షణ రంగానికి చెందిన కొన్ని కంపెనీల కారణంగా నిక్కీ ఉక్రెయిన్‌కు మద్ధతు తెలుపుతున్నారని వివేక్ ఆరోపించారు.విదేశాంగ విధానం విషయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు బైడెన్‌కు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అలా రిపబ్లికన్ ప్రైమరీ తొలి డిబేట్ వాడివేడిగా సాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube