తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.కేసులు తగ్గుతూ మళ్లీ పెరుగుతున్నాయి.
దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మెల్లిగా పెరుగుతున్నాయి.
వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో ఒకరి నుంచి మరొకరికి మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.వైరస్ వ్యాప్తితో పాటు మరణాల సంఖ్య కూడా అలానే కొనసాగుతోంది.
ప్రజలు వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది.
తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,718 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,97,327కి చేరింది.
నిన్నఒక్కరోజే 8 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.మరణించిన వారి సంఖ్య 1,153కి పెరిగింది.
గడిచిన 24 గంటల్లో 2,002 మంది కరోనా నుంచి క్యూర్ అయ్యారు.దీంతో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 1,67,846 కి చేరింది.
నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 49,084 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు.దీంతో రాష్ట్రంలో 31,53,626 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 85.05 శాతంగా ఉందని, మరణాల రేటు 0.58 శాతంగా ఉందన్నారు.కొన్ని జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 285, కరీంనగర్ లో 105, మేడ్చల్ మల్కాజిగిరిలో 115, నల్గొండలో 103, రంగారెడ్డిలో 129, సిద్ధిపేటలో 76, ఖమ్మంలో 79, నిజామాబాద్ లో 58 కరోనా కేసులు నమోదయ్యాయి.