సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్( Star heroines ) లో ఒకరు సమంత.‘ఏం మాయ చేసావే’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన సమంత( Samantha ), అందం తో పాటుగా అద్భుతమైన అభినయం ఉన్న నటీమణులలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.ఆమె కెరీర్ ని నాగ చైతన్య తో పెళ్లి కి ముందు, పెళ్లికి తర్వాత అని విభజించవచ్చు.పెళ్లి తర్వాత, అతనితో విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి దూరం గా ఉంటూ వచ్చింది.
కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె జర్నీ కొనసాగింది.సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ఉన్నప్పటికీ కూడా నెగటివ్ రోల్స్ చెయ్యడానికి ఏ మాత్రం సంకోచించని డేరింగ్ హీరోయిన్ గా సమంత ఒక ఇమేజి ని ఏర్పాటు చేసుకుంది.
ప్రస్తుతం ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకి సగటున పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది.

ఇంత బ్రాండ్ ఇమేజి ఉన్న సమంత కి యాడ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి.ఇండియా లో ఇప్పటి వరకు ఆమె ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించింది.కేవలం టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా, సమంత సోషల్ మీడియా యాడ్స్ ( Social media ads )కూడా ఒక రేంజ్ లో చేస్తాది.
ఇంస్టాగ్రామ్ లో ఈమెకి ఉన్న ఫాలోయింగ్ పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా లేదు.ఆమె ఒక్కో పోస్ట్స్ కి ఇంస్టాగ్రామ్( Instagram ) లో మిలియన్ల కొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ వస్తూ ఉంటాయి.
ఆ రేంజ్ ప్రభావితం చెయ్యగల సెలెబ్రిటీ కాబట్టే, వినియోగదారులు ఈమె బ్రాండ్ ని ఉపయోగించుకొని తమ ప్రొడక్ట్స్ కి మార్కెట్ రప్పించుకోవడానికి చూస్తుంటారు.ఆమె వల్ల ఆ రేంజ్ ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇంస్టాగ్రామ్ లో ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించి పోస్టు పెట్టాలంటే 15 లక్షల రూపాయిల వరకు ఛార్జి చేస్తుందట సమంత.

కేవలం సమంత మాత్రమే కాదు, ఇంస్టాగ్రామ్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ అందరూ ఇదే రేంజ్ లో డిమాండ్ చేస్తారట.కానీ సౌత్ నుండి ఆ రేంజ్ డిమాండ్ ఉన్న నెంబర్ 1 హీరోయిన్ సమంత మాత్రమే.ఓవరాల్ ఇండియా లో సమంత ని మించిన హీరోయిన్స్ అయితే అలియా భట్, శ్రద్ద దాస్ మరియు దీపికా పదుకొనే వంటి వారు ఉన్నారు.లేటెస్ట్ గా సమంత ఇంస్టాగ్రామ్ లో బజార్ అనే మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ని అప్లోడ్ చేసింది.
సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలే కనిపిస్తున్నాయి.వయసు పెరిగే కొద్దీ సమంత అందం పెరిగిపోతూ వెళ్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.







