ప్రస్తుత కాలంలో ప్రేక్షకులందరూ కూడా ఎక్కువగా థ్రిల్లింగ్, హ్యాకింగ్ సినిమాలకు మంచి ఆసక్తిని చూపిస్తారు.ఇలాంటి సినిమాలకు ఈ మధ్యకాలంలో మంచి ప్రేక్షకాదరణ కూడా లభిస్తుంది.
తాజాగా ఇలాంటి జానర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం 1134 టైటిల్ వినడానికి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగానే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి.కొత్త దర్శకుడు శరత్ చంద్ర( Sarath Chandra ) తడిమేటి దర్శకత్వంలో కొత్త నటులతో శాన్వీ మీడియా, రాంధుని క్రియేషన్స్ బ్యానర్స్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు జనవరి 5న విడుదల అయింది.
మరి ఈ సినిమా కథ ఏంటి అసలు ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం.
కథ: 1134 అనే కథ ఓ ముగ్గురితో మొదలవుతుంది.ఓ వ్యక్తి. లక్ష్మణ్( Lakshman )(ఫణి శర్మ), ఎరిక్ (గంగాధర్ రెడ్డి), హర్ష్ (ఫణి భార్గవ్)అనే ముగ్గురు యువకులకు సంబంధించి ఈ సినిమా కథ మొత్తం నడుస్తుంది.
అయితే ఈ ముగ్గురు యువకులను కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ లో పడేస్తారు.ఇక వారికి ఒక వ్యక్తి మీకు ఈరోజు మాత్రమే టైం రేపటికి మీరు అవుట్ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు.
అయితే ఆ ముగ్గురిని ఎందుకు కిడ్నాప్ చేశారు అనే విషయం తెలియక ఈ ముగ్గురు కూడా ఒక్కొక్కరు వారి కథలను చెప్పుకుంటూ వస్తారు.అయితే ఈ ముగ్గురికి డబ్బు అవసరమనేది ఏర్పడుతుంది.
ఓ వ్యక్తి ఎరిక్ కి డబ్బులు ఇచ్చి ATMలు ఉండే సీసీ కెమెరాలని హ్యాక్ చేసి పని చేయకుండా చేస్తాడు.లక్ష్మణ్ కి బస్టాప్స్ లో ఉండే బ్యాగ్స్ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తాడు.
హర్ష్ కి ATM లలో డబ్బులు తీసుకొని రావాలని చెప్తారు.దీంతో వీళ్ళ ముగ్గురి తెలియకుండానే వీరు ఒకరికే పని చేసి ఉంటారు.
దీంతో ఈ ముగ్గురు చేసిన క్రైమ్ బయటపడకుండా ఉండటం కోసమే వీరిని కిడ్నాప్ చేసి చంపేయాలని ప్లాన్ చేశారని అర్థం చేసుకున్నటువంటి వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు? అసలు అక్కడి నుంచి తప్పించుకున్నారా? తప్పించుకొని ఏం చేశారు అన్నది ఈ సినిమా కథ.
నటీనటుల నటన: ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ కూడా కొత్త వారే.అయితే ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి.ఇక ఈ ముగ్గురు యువకులు కాకుండా మిగిలిన పాత్రలలో నటించిన వారు కూడా పరవాలేదు అనిపించుకున్నారు.

టెక్నికల్: ఈ సినిమాకు దర్శకుడు కొత్త వ్యక్తి అయినప్పటికీ సినిమాలంటే చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాదిరిగా స్క్రీన్ ప్లే ని అద్భుతంగా చూపించారు.ఇక సినిమా మొత్తం రాత్రి కావడంతో కెమెరా విజువల్స్ కూడా అద్భుతంగా వచ్చాయి.ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు అనిపించింది.ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.
విశ్లేషణ: ఈ సినిమా మొదటి భాగం అంతా కూడా వారిని కిడ్నాప్ చేయడం అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో అనే విషయాలను తెలుసుకోవడంతోనే కథ మొత్తం పూర్తి అవుతుంది.ఈ సినిమా మొదటి భాగం కాస్త నిదానంగానే సాగినట్టు ఉంది కానీ రెండవ భాగం వచ్చేసరికి అసలు ఈ ముగ్గురు ఒకరికి పని చేశారా అనే విషయం తెలియడంతో సినిమా కూడా ఆసక్తికరంగా మారుతుంది.
చివరకు ఓ వ్యక్తిని పట్టుకోవడంతో కథ అయిపోకుండా చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చి కథని ఇంకొంచెం నడిపిస్తారు.సినిమాలో ఒక్క లేడి పాత్ర కూడా లేకపోవడం విశేషం.

ప్లస్ పాయింట్స్: సరికొత్తగా కథ ఎంపిక చేసుకోవడం, కెమెరా విజువల్స్ నటీనటుల నటన, మ్యూజిక్.

మైనస్ పాయింట్: లేడీ క్యారెక్టర్స్ లేకపోవడం ఫస్ట్ హాఫ్ స్లోగా కొనసాగడం.
బాటమ్ లైన్: మొత్తంగా 1134 సినిమా తక్కువ పాత్రలతో సాగే ఓ క్రైమ్ థ్రిల్లర్.హీస్ట్ క్రైమ్, థ్రిల్లింగ్, హ్యాకింగ్ లాంటి కథలు నచ్చేవారు ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తేనే ఆ థ్రిల్ ఫీలవుతారు.
రేటింగ్: 2.75/5







