జీడిపప్పు లో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.వీటిని తినడం వల్ల మన శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుంది.
అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది జీడిపప్పు వల్ల మనకు కలిగే ఆరోగ్యకర లాభాల గురించి కాదు, దాని రేటు గురించి.సాధారణంగా మానకు మార్కెట్‌లో దొరికే జీడిపప్పు రేటు కిలోకు రూ.800 వరకు ఉంటుంది.క్వాలిటీని బట్టి రేటు మారుతుంది.అయనప్పటికీ రూ.800 వరకు కిలో జీడి పప్పు రేటు ఉంటుంది.అయితే మీకు తెలుసా.? మన దేశంలో ఉన్న ఆ ప్రాంతంలో మాత్రం జీడిపప్పు ధర రూ.10 మాత్రమే.

అవును, మీరు విన్నది నిజమే.ఆ ప్రాంతంలో జీడిపప్పు కిలో ధర రూ.10 మాత్రమే.ఇంతకీ ఆ ప్రాంతం ఏదంటే… జార్ఖండ్‌లోని జమతాడా జిల్లా.
అక్కడ జీడిపప్పు చాలా తక్కువ ధరకు లభిస్తుంది.మనం ఊహించనంత తక్కువ రేటుకు వారు జీడిపప్పును అమ్ముతారు.కిలోకు కేవలం రూ.10 మాత్రమే తీసుకుంటారు.ఎందుకంటే అక్కడ 49 ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి.అందుకే ఈ జిల్లా వాసులకు జీడిపప్పు చాలా తక్కువ ధరకు లభిస్తుంది.

ఇక ఈ ప్రాంతం నుంచి వెళ్లేవారు అయితే అక్కడ ఓ సారి ఆగి కావల్సినంత జీడిపప్పును కొనుక్కుని మరీ వెళ్తారు.అవును మరి, అంత తక్కువ ధరకు జీడిపప్పు మళ్లీ ఎక్కడా దొరకదు కదా.కనుకనే ఒక్కసారే కావల్సినంత జీడిపప్పును కొంటారు.మరి మిగతా ప్రాంతాల్లో అంత ఎక్కువ రేటు ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా.? అవును, మీరు ఆశ్చర్యపోయినా జీడిపప్పుకు మాత్రం మిగిలిన ప్రాంతాల్లో చాలా ఎక్కువ రేటే ఉంది.ఎందుకంటే.
అది అందరికీ తెలిసిన విషయమే.దళారులు.! వాళ్లే అంత రేటును పెంచి దాన్ని అమ్ముకుంటున్నారు.కానీ పాపం దాన్ని పండించే రైతులకు మాత్రం చాలా తక్కువ ధర చెల్లిస్తున్నారు.ఈ దళారీ వ్యవస్థ పోనంత వరకు రైతులకు మంచి రోజులు రావనే చెప్పవచ్చు.!
.