టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.సత్తెనపల్లిలో జరిగిన యువగళం సమావేశం అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు.
లోకేశ్ దిగజారి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు తన మీద పడ్డారన్న మంత్రి అంబటి బీసీ సోదరులు అని పలుకడమే లోకేశ్ కు రాదంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలు సైతం లోకేశ్ మాటలను విని నవ్వుకుంటున్నారని చెప్పారు.అనంతరం చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఎంత నీచంగా మాట్లాడారో తెలుసుకో అంటూ లోకేశ్ కు సూచించారు.
సత్తెనపల్లిలో వందలాది ఎకరాల పొలం కొన్నానటన్న అంబటి తాను కొన్నది 18 ఎకరాలు మాత్రమేనని వెల్లడించారు.రేపల్లెలో ఉన్న ఆస్తులు అమ్ముకొని పొలం కొన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని మరోసారి స్పష్టం చేశారు.





 

