మొండి బకాయిలు పై ఫోకస్.. పంపు కలెక్షన్ కట్..ఆస్తులు జప్తు!

నూటికి నూరు శాతం యుద్ధ ప్రాతిపదికన పన్నులు వసూలు చేయాలని అధికారులకు, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు జారీ చేశారు.

కార్యాలయంలోని అన్ని విభాగాల నుండి ప్రత్యేక అధికారుల తో 10 బృందాలను ఏర్పాటు చేశారు.

ప్రతి ఒక్కరికి 30 చొప్పున నగర పరిధిలోని 300 మొండి బకాయిలను మార్చి 31 వరకు వసూలు చేయాలని ఆదేశించారు.ఉదయం 7:00 గం లకు కార్యాలయంలో బయోమెట్రిక్ ఉపయోగించి, తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని అన్నారు.మొండి బకాయిలు, పన్నులు సకాలంలో చెల్లించలేని వారిపై చర్యలు తప్పనిసరిగా ఉంటాయని, వారి పంపు కలెక్షన్ ను తొలగించబడతాయని అన్నారు.

వారి ఆస్తులు జప్తు చేయబడతాయని అందుకు పోలీస్ శాఖ వారి సహాయం కూడా ఉంటుందని, DRF టీం కూడా పాల్గొంటారని తెలిపారు.కమిషనర్ ఆదేశాలతో ఈరోజు ఉదయం నుంచే అధికారులు పన్ను వసూళ్లలో నిమగ్నమయ్యారు.

వారితో పాటు సహాయక కమిషనర్ మల్లేశ్వరి, మేనేజర్,ఈ ఈ, ఆర్ఓ,ఆర్ఐ, టిపిఓలు ఉన్నారు.

Advertisement
హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!

తాజా వార్తలు