నా పేరు సూర్యలో ఇదే పెద్ద మైనస్‌ : ఒక మెగా అభిమాని

అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్‌ మరియు నాగబాబులు సంయుక్తంగా నిర్మించిన ‘నా పేరు సూర్య’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల నడుమ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంకు మిశ్రమ స్పందన వస్తుంది.

మెగా ఫ్యాన్స్‌కు ఇది మరో బ్లాక్‌ బస్టర్‌ను తెచ్చి పెడుతుందని, మెగా ఫ్యాన్స్‌ తల ఎత్తుకునేలా ఈ చిత్రం ఉంటుందని అంతా భావించారు.కాని షాకింగ్‌గా ఈ చిత్రం ఫలితం తారు మారు అయ్యింది.

ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుంది.

Big Minus In Naa Peru Surya Movie

ఈ చిత్రంపై ఒక మెగా అభిమాని తన సోషల్‌ మీడియా పేజీలో ఇలా రాసుకున్నాడు.రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా అనగానే చాలా అంచనాు పెంచుకున్నాను.తప్పకుండా ఇది భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం కలిగింది.

Advertisement
Big Minus In Naa Peru Surya Movie-నా పేరు సూర్యలో ఇ

సినిమా ఫస్ట్‌ ఇంపాక్ట్‌ విడుదలైన వెంటనే అబ్బ బన్నీకి బ్లాక్‌ బస్టర్‌ ఖాయం అని అందరితో పాటు నేను కూడా అనుకున్నాను.కాని సినిమా విడుదల తర్వాత ఫలితం చూసి షాక్‌ అయ్యాను.

ట్రైలర్‌ మరియు టీజర్‌లో చూపించింది ఒకటి, సినిమాలో చూపించింది మరోటిలా ఉంది.సినిమాలో బన్నీ పాత్ర మాత్రమే బాగుంది.

మిగిలిన ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయింది.ముఖ్యంగా విలన్స్‌ను బఫూన్స్‌ మాదిరిగా చూపించాడు.

రాజమౌళి సినిమాలో విలన్స్‌ పవర్‌ ఫుల్‌గా ఉంటారు.అందుకే హీరోలు కూడా చాలా పవర్‌ ఫుల్‌గా అనిపిస్తారు.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

దర్శకుడు వంశీ ఒక మంచి స్టోరీతో సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేది.ఒక రెగ్యులర్‌ స్క్రీన్‌ప్లేతో ఏమాత్రం ఆకట్టుకోని ట్విస్ట్‌లతో సినిమాను నడిపించాడు.

Advertisement

బన్నీ పాత్రపై పెట్టిన దృష్టి దర్శకుడు ఇతర కథ మరియు స్క్రీన్‌ప్లేపై పెట్టి ఉంటే బాగుండేది అంటూ పోస్ట్‌ చేశాడు.సినిమా చూసిన ప్రతి ఒక్క మెగా ఫ్యాన్‌ అభిప్రాయం ఇదే.నా పేరు సూర్య చిత్రంతో ఒక మంచి సక్సెస్‌ను అందుకుంటాడని భావించిన మెగా ఫ్యాన్స్‌కు ఇది తీవ్ర నిరాశ అని చెప్పక తప్పదు.భారీ స్థాయిలో అంచనాల నడుమ విడుదలైన ‘నా పేరు సూర్య’ చిత్రం మొదటి వారంలో ఖచ్చితంగా 75 కోట్లను వసూళ్లు చేయనుందని అంతా భావించారు.

కాని ప్రస్తుతం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను బయట పడేయడం కష్టం అనిపిస్తుంది.

తాజా వార్తలు