నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు.మూడు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం దక్కిందని తెలిపారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీకి భారీ మెజార్టీ ఇచ్చారన్న కిషన్ రెడ్డి తెలంగాణలో ఆ పరిస్థితి లేదని చెప్పారు.అయితే తెలంగాణలోనూ బీజేపీకి సీట్లు పెరిగాయని పేర్కొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ చరిత్ర సృష్టించిందని తెలిపారు.దేశ రాజకీయాల్లో ఎక్కడా ఇటువంటి గెలుపు లేదన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి రాష్ట్ర నాయకత్వం తరపున అభినందనలు తెలిపారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.