అమెరికా విద్యలో “భారత విద్యార్ధులదే” హవా

ఎంతో మంది భారతీయులు ఉన్నతమైన ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకి వెళ్లినట్లుగానే ఉన్నతమైన విద్య కోసం కూడా అమెరికా వెళ్ళి అక్కడ విద్యని ముగించుకుని అక్కడే మంచి ఉద్యోగాలలో స్థిరపదిపోతున్నారు అయితే గత దశాబ్దకాలంలో అమెరికాలో చదువుకునే భారతీయులసంఖ్య రెట్టింపు అయ్యిందని ప్రతీ ఆరుగురిలో ఒకరు కనీసం భారత విద్యార్ధి ఉంటున్నారని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా చెప్పారు.

యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన నాలుగో స్టూడెంట్‌ వీసా డే కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా వచ్చారు.

ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లో సుమారు 800మందికి వీసాలిచ్చారు.కొందరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి కాన్సుల్‌ జనరల్‌ వీసాలను అందజేశారు.

కేథరిన్‌ మాట్లాడుతూ.పదేళ్ల క్రితం అమెరికాలో దాదాపు 90వేల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటుండగా ప్రస్తుతం 1.86 లక్షలు దాటారని హైదరాబాద్‌లో అద్భుతమైన సంస్థలు, హైటెక్‌, అంకుర పరిశ్రమలు ఉండటం వల్ల యువత ఉన్నత విద్యను అభ్యసించాలని ఆమె భావిస్తున్నారు.అమెరికాలో మొత్తం 4,500 కళాశాలలు, విశ్వవిద్యాలయాలు భిన్నమైన కోర్సులు అందిస్తున్నాయని, అక్కడ నైపుణ్యం, అనుభవం పెంచుకొని తమ లక్ష్యాలని చేరుకోవచ్చుని తెలిపారు.

అయితే తమ చదువులు పూర్తీ అయ్యాక స్వదేశానికి వచ్చి భారత పురోభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో అమెరికాలో చదివి స్వదేశానికి తిరిగొచ్చి స్థిరపడిన నటుడు అడవి శేషు, మీనారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు