బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వడానికి సమంత నే కారణం

సినిమా పరిశ్రమ లో సెంటిమెంట్ లకి అడ్డు ఉండదు.అన్ని వ్యవహారాల్లో ఎదో ఒక రకంగా సెంటిమెంట్ ని ఇరికించడం మనోళ్ళకి బాగానే అలవాటు ఉన్న వ్యవహారం.

సైన్స్ మీద సినిమాలు తీసినా కూడా అందులో సెంటిమెంట్ ఉంది తీరాల్సిందే.హీరోయిన్ సమంత కి కూడా ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఉంది.

తాను చెయ్యబోయే ఒక ఫలానా సినిమా గురించి ఎవ్వరికీ ఎక్కడా చెప్పకపోవడమే ఆమె పెట్టుకున్న సెంటిమెంట్ ఏ డైరెక్టర్ తో ఏ హీరో తో ఏ బ్యానర్ లో సినిమా చేస్తోంది అనేది మొదటి రోజు షూటింగ్ అయ్యే వరకూ ఆమె చెప్పాదు గాక చెప్పదు అది ఆమె సెంటిమెంట్.ఐతే సమంతకు ఎప్పట్నుంచి ఈ సెంటిమెంటు ఉందో తెలియదు.

సమంత కెరీర్లో సక్సెస్ రేట్ ఎక్కువే.ఐతే ఆమె కెరీర్లో రభస.అంజాన్ (సికిందర్) లాంటి కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి.మరి ఆ సినిమాల గురించి ముందే చెప్పేసిందో ఏమో.ఆ ఫలితాలు చూశాకే ఈ సెంటిమెంటు మొదలైందో ఏమో తెలియదు కానీ.ఈ మధ్యే వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ విషయంలో సమంత సెంటిమెంటు పాటించిందా లేదా అన్నదే తెలియాల్సి ఉంది.

Advertisement

సమంత సెంటిమెంటు గురించి తెలిసిన వాళ్లు మాత్రం.ఆమె బ్రహ్మోత్సవం గురించి ముందే మాట్లాడేసి ఉంటుందేమో.

అందుకే ఈ సినిమాకు అంత దారుణమైన ఫలితం వచ్చిందేమో అని సెటైర్లు వేస్తున్నారు.మరి నిజంగా సమంత ఆ తప్పు చేసిందా?.

Advertisement

తాజా వార్తలు