పూరి జగన్నాథ్ సపోర్ట్ ఇచ్చేసాడు

అసహనం మీద ఆమీర్ ఖాన్ చేసిన వాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా ఆమీర్ ఖాన్ నామస్మరణ ఇప్పట్లో ఆగేలా లేదు.

కొందరు తిట్టుకుంటున్నారు, కొందరు మెచ్చుకుంటున్నారు.కాని ఆమీర్ పేరు మాత్రం మారుమోగిపోతూనే ఉంది.

బీజేపి నిరసన కార్యక్రమాలు చేపడుతోంటే, సినీలోకంలో కొంతమంది ఆమీర్ వైపు మాట్లాడుతున్నారు, మరికొంతమంది ఇకపై మేము నీ అభిమానులం కాదు అని విమర్శిస్తున్నారు.పూరి జగన్నాథ్ ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించారు.

ఆమీర్ ను వెనకేసుకొచ్చారు.పనిలేని వాళ్ళంతా ఆమీర్ మీద ఎడుస్తున్నారని, ఆమీర్ సెలబ్రిటి కావడంతో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, అదే ఆమీర్ ఏ తివ్రవాదో అయ్యుంటే ఒక్కడికి కూడా ఆ ధైర్యం ఉండేది కాదని.

Advertisement

ఆమీర్ పడుతున్న బాధలు తెలీయకుండా ఊరికే వివాదం రేపుతున్నారని చెప్పాడు పూరి.ఆమీర్ తో అవకాశం కోసం పూరి ఇలా చేసాడని కొందరు అంటుంటే, మీడియా మాయలో పడకుండా, ఆమీర్ చెప్పిన మాటల్లోని వాస్తవాలని గమనించి పూరి సపోర్ట్ చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు