రూ.500 జియో 4G ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇవిగో

సంచలనాల జియో, ఎవరు ఊహించని మరో సంచలనానికి తెరలేపుతోంది.ఎవరు ఊహించకపోవడం ఏమిటి .

జియో నుంచి 4G మొబైల్ వస్తుందని, చాలా తక్కువ ధరకే వస్తుందని ముందే తెలుసుగా అని అంటున్నారా.తక్కువ ధరకే వస్తుందని ముందే తెలుసు కాని మరీ ఇంత తక్కువా? 1500 నుంచి 2000 రూపాయల మధ్యలో వస్తుందనుకున్న 4G ఫోన్ మరీ టూ మచ్ గా రూ.500 లకే రావడం ఏమిటి ? అందుకే ఎవరు ఊహించని సంచలనం అంటున్నాం.దాంతో లో రేంజ్ మొబైల్స్ లో మార్కెట్ ని ఆక్రమించుకున్న సామ్సంగ్, నోకియా లాంటి కంపెనీలకు పెద్ద చాలెంజ్ విసిరింది జియో.అయినా రూ.500 ఫోన్ అంటే ఏం బాగుంటుంది .ఎదో డబ్బా ఫోన్ అని పొరబడేరు.దీని ఫీచర్స్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

టెక్ ప్రపంచంలో ప్రచూరితమవుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ జియో 500 4G ఫోన్లో చాలా అధ్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.అవేంటో చూడండి.Display : 2.4 inches RAM - 512 MB Internal Storage - 4GB Expandable storage - Yes microSD card slot Processor - Qualcomm and Spreadtrum chipsets Back Camera - 2 megapixels Front Camera - VGA 4G - Yes (voLTE) Wi-Fi - Yes NFC - Yes GPS - Yes 500 రూపాయల్లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ వస్తుందని ఎనాడైన ఊహించామా ? ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు జులై 21న జరిగే వార్షిక సమావేశంలో ప్రకటిస్తారు ముకేష్ అంబాని.ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ మొబైల్ ని లాంచ్ చేస్తారట.

అయితే మార్కెట్ లోకి ఈ ఫోన్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేది మాత్రం సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ లోనే అంటున్నారు.అప్పుడైతే పండగ వాతావరణం ఉంటుంది కదా.అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారు.జియో టార్గెట్ చాలా క్లియర్ గా ఉంది.

Advertisement

పెద్ద పెద్ద మొబైల్స్ పై అంతగా ఆసక్తి చూపని గ్రామీణ ప్రజల మీదే ఫోకస్ పెట్టింది జియో.సామ్సంగ్, నోకియా మార్కెట్లను గురి చేసింది.

గ్రామీణ ప్రజలకు, వ్యవసాయం చేసేవారికి కూడా 4G ఫోన్, 4G ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని, ఆ సెగ్మెంట్ లోకి కూడా జియో వ్యాపారం విస్తరించాలని అంబాని ఆశయం.

Advertisement

తాజా వార్తలు