మొదటి పార్ట్‌లో యుద్దం పూర్తి అయిన తర్వాత రెండవ పార్ట్ సినిమా ప్రారంభం అవుతుంది.రెండవ పార్ట్‌లో కుంతల దేశపు యువరాణి దేవసేనతో బాహుబలి మరియు భల్లాలదేవలు ప్రేమలో పడతారు.
అయితే దేవసేన మాత్రం బాహుబలిని ప్రేమిస్తుంది.బాహుబలి ప్రేమను శివగామి ఒప్పుకోదు.
దాంతో దేవసేనతో కలిసి బాహుబలి మహిస్మతి రాజ్యం వదిలి వెళ్తాడు.భల్లాలదేవుడు మహిస్మతి రాజు అవుతాడు.
అలా కొన్ని రోజు గడిచిన తర్వాత కాలకేయులు మరోసారి మహిస్మతిపైకి దండెత్తి వస్తారు.వారిని ఎదుర్కోవడం భల్లాలదేవుడి తరం కాదు.
విషయం తెలుసుకున్న బాహుబలి మహిస్మతి రాజ్యంను కాపాడేందుకు యుద్దంలో దిగుతాడు.
యుద్దంలో కాలకేయులను అంతమొందించి మహిస్మతిని గెలిపిస్తాడు.
యుద్దం పూర్తి అయిన తర్వాత సింహాసనంకు కట్టు బానిస అయిన కట్టపతో బాహుబలిని భల్లాలదేవుడు చంపిస్తాడు.భల్లాలదేవకు మద్దతు ఇచ్చి పెద్ద తప్పుచేశాను అని తెలుసుకున్న శివగామి కన్న కొడుకు అని కూడా చూడకుండా చంపేందుకు ప్రయత్నిస్తుంది.
ఆ ప్రయత్నం విఫలం అవుతుంది.ఆ సమయంలోనే దేవసేన కొడుకుకు జన్మనిస్తుంది.
ఆ కొడుకును చంపాలని భల్లాలదేవుడు ప్రయత్నిస్తాడు.దాంతో శివగామి పసి బాలుడుని కాపాడి చనిపోతుంది.
తన ప్రేమను కాదన్నందుకు దేవసేనను బందీగా చేస్తాడు భల్లాలుడు.ఈ కథాంశంతో రెండవ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమాకు ‘బాహుబలి` కంక్లూజన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా కూడా ఇటీవలే రానా చెప్పుకొచ్చాడు.వచ్చే సంవత్సరం రాబోతున్న ఈ రెండవ పార్ట్ కోసం ఇప్పటి నుండే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.