ముగ్గురి పదవులు ఊడిపోతాయా?

తెలంగాణలో ముగ్గురు మంత్రుల పదవులు ఊడిపోయే సమయం వచ్చిందా? ఈ నెలలోనే ఆ పని జరుగుతుందా? ఇందుకు అవును అనే సమాధానం వస్తున్నది.

కొందరు మంత్రుల పదవులు పోతాయని కొంత కాలంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

అయితే ఇప్పుడు ఆ ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి.పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, మద్యం శాఖ మంత్రి పద్మా రావు, హొమ్ మంత్రి నాయిని నరసింహా రెడ్డిని తప్పిస్తారని సమాచారం.

ఈ నెల ఆఖరులోగా మంత్రి వర్గంలో మార్పులు జరగవచ్చు.నాయిని పనితీరు బాగానే ఉన్నా ఆయన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కెసీఆర్ భావిస్తున్నారు.

ఆయన సీనియారిటీ పార్టీకి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.చీప్ లిక్కర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కెసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు.

Advertisement

ఇది పద్మారావు కారణంగానే జరిగిందని అనుకుంటున్నారు.అందుకని ఆయన్ని బలి చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

చందూలాల్కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.కాబట్టి తప్పిస్తున్నారు.

ముఖ్యమంత్రి చైనా పర్యటన నుంచి రాగానే సెప్టెంబర్ 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.మరి మంత్రి వర్గంలో మార్పులు ఈలోగా చేస్తారా? తరువాత చేస్తారా? తెలియదు.మరి కొంతమంది మంత్రుల మీద కూడా సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు