అలా వేరే వాళ్లతో పేరు పంచుకోవడం ఇష్టం లేదన్న దేవి శ్రీ ప్రసాద్‌

టాలీవుడ్ స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ ఈ ఏడాదిని పుష్ప సినిమా తో సూపర్ హిట్ గా ప్రారంభించాడు.గత ఏడాదిలోనే పుష్ప విడుదల అయిన సందడి మాత్రం ఈ ఏడాది ఆరంభంలో కనిపిస్తుంది.

 Devi Sri Prasad About Bollywood Entry Details, Devisri Prasad, Music Director, S-TeluguStop.com

సినిమాలోని ప్రతి పాట కూడా ఆహా అన్నట్లుగా దూసుకు పోతుంది.రికార్డు బ్రేకింగ్ యూట్యూబ్‌ వ్యూస్ ను ఈ సినిమా రాబడుతూనే ఉంది.

ప్రస్తుతం పాటలతో సౌత్‌ లో టాప్‌ స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దేవి శ్రీ ప్రసాద్‌ బాలీవుడ్‌ నుండి ఆఫర్లు వస్తున్నా కూడా పోవడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బాలీవుడ్‌ ఆఫర్‌ అంటే ప్రతి ఒక్కరు కూడా కళ్లు మూసుకుని వెళ్లాలి.

కాని దేవి శ్రీ ప్రసాద్ ఎందుకు వెళ్లడం లేదు అనేది చర్చ.అసలు విషయం ఏంటీ అంటే బాలీవుడ్‌ లో ఎక్కువ సినిమా లకు ఒక్క సంగీత దర్శకుడు పని చేయడం లేదు.

ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడితో చేయిస్తున్నారు.

ఒక్క సినిమాకు ముగ్గురు లేదా నలుగురు సంగీత దర్శకులు వర్క్‌ చేయాల్సి వస్తుందట.

అంటే బాలీవుడ్‌ లో ఒక్క సినిమాకు ఎంతో మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు.అందుకే దేవి శ్రీ ప్రసాద్ కు ఆ విధానం నచ్చడం లేదట.

ఒకరితో కలిసి టైటిల్ కార్డ్‌ ను షేర్‌ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.తాను సంగీతం అందించేందుకు సిద్దంగా ఉన్నాను.

కాని వారు ఒక్క పాట రెండు పాటలు మాత్రమే అడుగున్నారు.

Telugu Bollywood, Devi Sri Prasad, Devisriprasad, Dsp Tollywood, Music, Pushpa,

ఒక బాలీవుడ్‌ సినిమా ఆఫర్‌ వస్తే మొత్తం అన్ని పాటలకు నేనే సంగీతాన్ని చేయాలి.అలాంటి ఆఫర్‌ వస్తేనే నేను చేస్తాను లేదంటే లేదు అన్నట్లుగా దేవి శ్రీ ప్రసాద్ అన్నాడు.మరో సంగీత దర్శకుడితో కలిసి తాను సినిమాను చేయను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇదే విషయాన్ని గతంలో థమన్ కూడా చెప్పుకొచ్చాడు.అక్కడ ఒకటి రెండు పాటలకు సంగీతం చేసే అవకాశం వస్తే ఆసక్తి కలగడం లేదు అన్నాడు.

వీరిద్దరు అక్కడ సినిమాలు చేసే విషయంలో ఒకే నిర్ణయం తో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube