ఆ విషయంలో జొమాటో కీలక నిర్ణయం..?!

ప్లాస్టిక్ రహిత వాతావరణం వలన మనకు, జంతువులకే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.కానీ కొంతమంది మాత్రం ప్లాస్టిక్ వస్తువులను ఇంకా వాడుతున్నారు.

ప్లాస్టిక్ వలన సమస్త మానవాళికి ఎన్నో ఇబ్బందులు ఎదురువుతాయనే విషయాన్నీ విస్మరించి మరి ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తున్నారు.ఇకపోతే హోటల్స్, రెస్టారెంట్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.

ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాక్సులు, ప్లాస్టిక్ స్పూన్స్ ఇలా చాలా ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు.ఈ క్రమంలో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే క్రమంలో జొమాటో యాప్ లో ప్రస్తుత డిఫాల్ట్ మోడ్‌ ని చేంజ్ చేస్తూ ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి అవసరమైతేనే తప్పా ప్లాస్టిక్‌ స్పూన్లు, ఫొర్క్స్ ఇవ్వడం జరుగుతుంది.

Advertisement

ఈ నేపథ్యంలో జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ఈ విధంగా ట్వీట్ చేసారు.జొమాటో యాప్‌ లో మీరు ఆర్డర్‌ చేసేటప్పుడు ప్లాస్టిక్‌ స్పూన్లు, ఫొర్క్స్‌ అవసరం లేదనుకునేవారు వాటిని వద్దు అనే చెప్పే విధంగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చామని దీపిందర్‌ తెలిపారు.

ఇంకో విషయం ఏంటంటే.మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టేటప్పుడు జొమాటో అప్లికేషన్ మీకు కట్లరీ అవసరమా లేదా అని అడగడం జరుగుతుంది.

ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మీరు ఆప్ట్-ఇన్ ఆప్షన్స్ ఎంచుకోవాలి.అదే వద్దనుకుంటే ఆప్ట్-అవుట్‌ ఆప్షన్‌ ని ఎంచుకోవాలి.

స్పూన్ల డిఫాల్ట్ డెలివరీని నిలిపివేయడం వలన కంపెనీకి ఒక రోజులోనే 5,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఆదా చేయగలదని గోయల్ వివరించారు.

నిజం చెప్పాలంటే జొమాటో ఈ నిర్ణయం తీసుకునే ముందు తమ కస్టమర్స్ అభిప్రాయం సేకరించిందట.అందులో బాగంగా 90% మంది కస్టమర్లు తమ ఆర్డర్‌ లతో పాటు ప్లాస్టిక్ కట్లరీలను డెలివరీ చేయాల్సిన పని లేదని చెప్పారట.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

అందుకే జొమాటో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఏది ఏమయినా ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే క్రమంలో జొమాటో సంస్థ కూడా తన వంతు కృషి చేస్తుంది అన్నమాట.

Advertisement

తాజా వార్తలు