ఐఫోన్ వాడుతున్నారా.. మీరు మోసపోతున్నట్లే.. షాకింగ్ నిజం బయటపెట్టిన మహిళ!

బెంగళూరుకు(Bangalore) చెందిన పూజా ఛాబ్డా(Pooja Chabda) అనే మహిళ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఐఫోన్(iPhone) వాడేవారికి, ఆండ్రాయిడ్(Android) ఫోన్లు వాడేవారికి ధరల్లో తేడా ఉందని ఆమె తేల్చారు.

ఒకే వస్తువుకు వేర్వేరు ధరల విషయం పూజా చేసిన చిన్న ప్రయోగంతో గుట్టు రట్టయింది.పూజా ఛాబ్డా జెప్టో యాప్‌లో ఒకేసారి ఐఫోన్( iPhone), ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగించి ధరలను సరిపోల్చారు.ఆండ్రాయిడ్(Android ) ఫోన్‌లో 500 గ్రాముల ద్రాక్ష ధర రూ.65గా ఉండగా, అదే ద్రాక్ష ఐఫోన్‌లో మాత్రం ఏకంగా రూ.146గా చూపించింది.అంటే రెండింతలకు పైగా తేడా, ఇది ఒక్కసారి జరిగిన పొరపాటు అనుకుంటే పొరపాటే.

క్యాప్సికమ్ ధరల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.ఆండ్రాయిడ్ ఫోన్‌లో క్యాప్సికమ్ ధర రూ.37 ఉంటే, ఐఫోన్‌లో మాత్రం రూ.69గా ఉంది.

Zepto Price Difference For Android And Iphone Users, Price Discrimination, Pooja

ఈ భారీ ధరల వ్యత్యాసం చూసి షాకైన పూజా ఛాబ్డా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.ఐఫోన్ వాడుతున్నవారు తాము చెల్లించే బిల్లులను ఒకసారి సరిచూసుకోవాలని ఆమె తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు.ఆమె వీడియోపై చాలా మంది నెటిజన్లు స్పందించారు.

Advertisement
Zepto Price Difference For Android And IPhone Users, Price Discrimination, Pooja

ఐఫోన్ యూజర్లు ఎక్కువ డబ్బులు పెట్టగలరనే ఉద్దేశంతో కంపెనీలు ఇలా చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు.

Zepto Price Difference For Android And Iphone Users, Price Discrimination, Pooja

"ఐఫోన్ కొనగలిగినప్పుడు, ఇలాంటి వాటికి ఎక్కువ చెల్లించడంలో తప్పులేదులే" అని ఒక యూజర్ సరదాగా కామెంట్ చేశారు.అయితే, ఈ ధరల వ్యత్యాసం కేవలం ఐఫోన్లకే పరిమితం కాకుండా, ప్రీమియం ఫోన్లు వాడేవారికి ధరలు, అందుబాటు, డెలివరీ సమయాల్లో కూడా తేడాలు ఉండొచ్చని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు.ఈ ఆరోపణలపై జెప్టో యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

వివరణ కోరినా వారు మౌనం వహిస్తున్నారు.ఈ విషయం వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా.. యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు