హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదు: సునీత

హైదరాబాద్: వైఎస్ వివేకా( YS Viveka Murder case )ను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే.

వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు.వైఎస్ వివేకా హత్యపై ఐదేళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని చెప్పారు.

Ys Suintha Comments On Avinash Reddy, YS Viveka Murder Case , CBI ,YS Sharmi

తనకు చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అని వివరించారు.అవినాష్ రెడ్డి( Avinash Reddy ) గెలవకుండా చేయడమే తన ప్రయత్నమని పేర్కొన్నారు.

హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు.తన పోరాటం రాజకీయం కోసం కాదని.

Advertisement

న్యాయం కోసమని స్పష్టం చేశారు.“ఆ తర్వాత సీబీఐ కేసుల్లో జగన్ అరెస్టయి జైలులో ఉన్నారు.

షర్మిల పార్టీని భుజాన వేసుకుని నడిపించింది.జగన్( YS jagan ) వెంట వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేసి గెలిపించారు.ఉప ఎన్నికల్లో విజయం తర్వాత షర్మిల( Sharmila )కు ఆదరణ వస్తోందని పక్కనపెట్టారు.2014 ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అందరూ భావించారు.అయితే.

ఆ స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు.ఇది వివేకాకు ఇష్టం లేదు.

ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమిపాలయ్యారు.అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో ఆయన ఓటమిపాలైన విషయం స్పష్టమైంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

నా కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని నేను మొదట నమ్మలేదు.వారిని సంపూర్ణంగా విశ్వసించడం నేను చేసిన పొరపాటు అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు