తెలుగు రాజకీయాలలో నారా వర్సెస్ వైయస్ కుటుంబాల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయ వాతావరణం ఉంటుంది.రాజకీయంగా ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గు మన్నట్టు పరిస్థితి ఉంటుంది.
ఇరు కుటుంబాలకు చెందిన నాయకులు చాలా వరకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా రాణించారు.నారా కుటుంబం నుండి చంద్రబాబు నాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది.
మరోపక్క వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) మరియు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా రాణించారు.
అటువంటిది క్రిస్మస్ పండుగ సందర్భంగా వైఎస్ షర్మిల( YS Sharmila ).టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )కి బహుమతులు పంపించడం జరిగింది.ఈ సందర్భంగా షర్మిలా పంపించిన క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్స్ లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.అంతేకాదు షర్మిలాకి లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు.“అద్భుతమైన క్రిస్మస్ బహుమతులు పంపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.నారా కుటుంబం మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది” అని లోకేష్ ట్వీట్ చేశారు.దీంతో నారా లోకేష్ కి వైయస్సార్ షర్మిల క్రిస్మస్ గిఫ్టులు పంపటం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.