తెలంగాణ ముఖ్యమంత్రి పై విమర్శలు చేసిన షర్మిల.. ?

మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల కాస్త దూకుడు ప్రదర్శిస్తుందంటున్నారు కొందరు.

ఇప్పటి వరకు పార్టీ విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకోలేదు గానీ ఓదార్పు యాత్ర పేరుతో వైఎస్ అభిమానులతో సమావేశాలు మాత్రం జరుపుతున్నారు.

అదీగాక తెలంగాణ సమస్యలపై గళమెత్తిన షర్మిల ఇదివరకు ఒకసారి తెలంగాణ సీయం పై విమర్శల వర్షం కురిపించారు.అయితే తాజాగా మరోసారి కేసీఆర్ విరుచుకు పడ్దారు.

ఈ నేపధ్యం లో జిల్లాలోని పటాన్ చెరు ప్రాంతంలో కాలుష్యం కోరలు చాస్తోందని, ముఖ్యమంత్రి జిల్లాగా చెప్పుకునే మెదక్ లో 20 కరవు మండలాలు ఉండటం బాధాకరమని విమర్శించారు.ఇక తెలంగాణ వచ్చాక నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు.

ఇక మల్లన్నసాగర్ కి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని ఇలా చెప్పుకుంటు పోతే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని, దీనికి కారణం ప్రస్తుతం ఉన్న పాలకులే అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
వైరల్ పోస్ట్ : దహీపూరి తినాలన్న మహిళా ఆన్లైన్ ఆర్డర్ చేయగా..?

తాజా వార్తలు