TV సీరియల్స్ కంటే దారుణం !!

తెలుగు సినిమాల కంటే తెలుగు సీరియళ్ళ లో సాగతీత ఎక్కువ, జీడిపాకం అంటూ మనం ఆ సీరియల్స్ నీ వాటిని చూసే వాళ్ళనీ ఏడిపిస్తూ ఉంటాం.

ఏళ్లకు ఏళ్ళు సాగుతూ ఉంటాయి అవి.

కొన్ని వేల ఎపిసోడ్ లు అవుతూనే ఉన్నా కొన్ని వేల రోజులు గడుస్తూ ఉన్నా ఆ సీరియల్ ఆగదు సరికదా కొత్త క్యారెక్టర్ లు ఎంటర్ అవుతూ విసిగిస్తూ ఉంటాయి అచ్చం అలాగే తయారు అయ్యింది ఇప్పుడు వైకాపా వారి పరామర్శ యాత్ర సంగతి.ఓదార్పు యాత్ర , పరామర్శ యాత్ర పేరు ఏదైనా కావచ్చు జీడిపాకం మాత్రం కామన్ అన్నట్టు సాగుతోంది వ్యవహారం.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల తెలంగాణలో చేస్తున్న పరామర్శ యాత్ర సగటు తెలుగు టీవీ సీరియల్‌ మాదిరిగానే కొనసాగుతోంది.కొన్నాళ్లు సాగి ఆగిపోయిన పరామర్శ యాత్ర కొత్త ఏడాదిలో రేపటి నుంచి (జనవరి 3వ తేదీ) మళ్లీ మొదలు కాబోతున్నది.

ఈ యాత్ర మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.ఏం ఆశించి తన సోదరి తో ఈ యాత్రలు చేయిస్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి, పైగా తెలంగాణా లో.అసలు మనుగడ కూడా లేదు వైకాపా కి ఆ ప్రాంతంలో అలాంటి చోట ఎందుకు ఇంత హడావిడి? కనీసం మీడియా కూడా పట్టించుకోని యాత్రలు ఇవి.మామూలు పార్టీలు ఎన్నికల ముందే హడావిడి చేస్తాయి అనీ తాము మాత్రం మొదటి నుంచీ చివరి దాకా జనాలతో ఉంటాం అని చెప్పుకోడం కోసం ఏమో !.

Advertisement
వీటి సంగతేంటి ? కూల్చివేతలపై బీఆర్ఎస్ ఫైర్

తాజా వార్తలు