కేసీఆర్, విజయశాంతి పై వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్దమని ప్రకటించినప్పటి నుండి వైఎస్ షర్మిల పై ఎన్నో విమర్శలు వచ్చాయి.

అయిన గానీ వెనకడుగు వేయకుండా వాటన్నీంటిని తిప్పికొడుతూ తన పార్టీ బలోపేతం కోసం ఏంచేయాల అనే ఆలోచనలో ఉన్నారట.

ఈ క్రమంలో షర్మిల తెలంగాణాలో పోటీచేయడం ఏంటని కొందరు ఎగతాళి కూడా చేశారట.వారందరికి సమాధానంగా సంచలన వ్యాఖ్యలు చేసారు షర్మిల.

YS Sharmila, Sensational Comments, KCR, Vijayashanti , YS Sharmila Sensational C

నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారట.అంతే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్, విజయశాంతి తెలంగాణ ప్రాంత వాళ్లేనా? అని ప్రశ్నించారట వైఎస్ షర్మిల.అదీగాక జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని అయినంత మాత్రనా తమిళ ప్రజలు జయలలిత స్దానికతను ఏనాడు ప్రశ్నించలేదని పేర్కొన్నారు.

ఇక నేను కూడా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే.పార్టీ వేరు, ప్రాంతం వేరైనా అన్నాచెల్లెళ్లుగా మేం ఒక్కటే అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా? అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? అని సూటిగా ప్రశ్నించారు.మొత్తానికి తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చాంశనీయంగా మారిందట.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

తాజా వార్తలు