మేనత్త విమలమ్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ షర్మిల..!!

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చెల్లెలు వైయస్ విమలమ్మ( S Vimalamma ) అందరికీ సుపరిచితురాలే.

కాగా ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డిపై.

సునీత, షర్మిల చేస్తున్న ఆరోపణలను ఖండించారు.వాళ్లకంటే పది సంవత్సరాలు చిన్నవాడైనా అవినాష్ రెడ్డి( Avinash Reddy )పై లేనిపోని అబండాలు వేస్తున్నారని పేర్కొన్నారు.

వైయస్ ఫ్యామిలీ పరువు బజారుకు ఈడుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో మేనత్త విమలమ్మ చేసిన కామెంట్లపై వైయస్ షర్మిల స్పందించారు.

వివేక హత్య కేసు విషయంలో సీబీఐ ఆధారాలను బట్టి తాము కామెంట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Ys Sharmila Reacts To Vimalamma Comments Ys Sharmila, Vimalamma, Congress , Ys
Advertisement
YS Sharmila Reacts To Vimalamma Comments YS Sharmila, Vimalamma, Congress , YS

హత్యా రాజకీయాలు ఆగాలనే అక్కాచెల్లెళ్లం కోట్లాడుతున్నాం.మా మేనత్త విమలమ్మ కుమారుడికి ముఖ్యమంత్రి జగన్ కాంట్రాక్ట్స్ ఇవ్వటంతో ఆర్థికంగా బలపడ్డారు.అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు.

కానీ వివేకానంద రెడ్డి గారు ఆమెకు ఎంత మేలు చేశారో మర్చిపోయినట్లున్నారు.వయసు మీద పడటంతో మర్చిపోవటం సహజమే.

అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మేనత్త విమలమ్మపై షర్మిల( YS Sharmila ) సెటైర్లు వేశారు.ఏపీలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానం నుండి వైయస్ షర్మిల పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కడప జిల్లాలో.

అంబలి ప్రతిరోజు త్రాగడం వల్ల ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

షర్మిల చేసిన వ్యాఖ్యలకు విమలమ్మ మండిపడ్డారు.దీంతో తనపై మేనత్త చేసిన కామెంట్లకు షర్మిల తనదైన శైలిలో స్పందించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు