మేమెందుకు మద్దతు ఇవ్వాలి ? జగన్ పై షర్మిల విమర్శలు

వైసిపి అధినేత జగన్ పై( YS Jagan ) అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల( YS Sharmila ) ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్మాకు కాంగ్రెస్( Congress ) మద్దతు ఇవ్వకపోవడం పైన షర్మిల క్లారిటీ ఇచ్చారు.

  అసలు ఢిల్లీలో( Delhi ) జగన్ చేస్తున్న ధర్మాకు మేమెందుకు మద్దతు ఇవ్వాలని షర్మిల ప్రశ్నించారు.

జగన్ అక్రమంగా బిజెపితో పొత్తు పెట్టుకున్నారని గత ఐదేళ్లలో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని షర్మిల విమర్శించారు.ఢిల్లీలో తాను చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు జగన్ కోరగా , తాము ఎందుకు ధర్నాకు సంఘీభావం ప్రకటించాలని షర్మిల ప్రశ్నించారు.

  తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే జగన్ ధర్నా చేస్తున్నారని , తనను తాను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను బిజెపికి తాకట్టు పెట్టారని షర్మిల విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ?  పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా ? ఐదేళ్లు బిజెపితో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను,  ప్రత్యేక హోదాను బిజెపికి తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం.

Advertisement

క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచ కోతకు గురిచేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బిజెపికే మద్దతు ఇచ్చారు కదా.వైఎస్ఆర్ వ్యతిరేకించినా మతతత్వ బిజెపికే జై కొట్టారు కదా.మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే, మీ నుంచి  వచ్చిందా సంఘీభావం ? మీ నిరసనలో నిజం లేదని,  స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం అని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది.సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు అంటూ షర్మిల సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు