తెలంగాణ రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు టిఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శలు చేస్తున్నారు.
అనేక ప్రజా సమస్యలపై ఆమె ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారు.ప్రజలకు దగ్గరయ్యేందుకు షర్మిల పాదయాత్ర కూడా చేపట్టారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ లో ఏ విధమైన మార్పులు తీసుకొస్తామనే విషయాన్ని హైలెట్ చేస్తూ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు.అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైన ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది అనే విషయాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే పార్టీలో ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోయినా, షర్మిల ధీమా గానే ముందుకు వెళ్తున్నారు.
తమకు ఇతర పార్టీల్లోని నాయకులు అవసరం లేదని, తమ పార్టీలో ఉన్న వారే నాయకులుగా ఎదుగుతారు అని చెప్పుకొస్తున్నారు.
తెలంగాణలో బలమైన పార్టీగా వైఎస్సార్ తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు .ఇది ఇలా ఉంటే ఆమె రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం పై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది.షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు.ఒక పార్టీ అధ్యక్షురాలి హోదాలో తొలిసారిగా ప్రతక్షంగా పోటీ చేయబోతున్నారు.దీంతో తన గెలుపుకు ఎటువంటి డోఖా లేకుండా ఖచ్చితంగా గెలుస్తాము అనే నియోజకవర్గం పైన ఇప్పటి వరకు ఆమె దృష్టి పెట్టారు.ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె డిసైడ్ అయ్యారు.
వాస్తవంగా పాలేరు నియోజకవర్గం లో గిరిజన , రెడ్డి సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ.

అందుకే ఆ నియోజకవర్గం అయితే తన గెలుపుకు ఎటువంటి డొఖా ఉండదు అనే అంచనాలో ఆమె ఉన్నారట.ఈ మేరకు ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని , తనకు అనుకూల పరిస్థితి ఏర్పడే విధంగా రంగంలో ప్రత్యేక టీమ్ ను షర్మిల ఏర్పాటుచేసుకున్నరట.పాలేరు నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి ? ప్రధానంగా పేరుకుపోయిన సమస్యలు ఏంటి ? వాటి పరిష్కార మార్గాలు ఏంటి ? ఇలా అనేక అంశాలపై షర్మిల టీమ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందట.







