కొత్త సంవత్సరం రాగానే వైకాపా పార్టీ చాలా పెద్ద షాక్ ని ఎదురుకుంటుంది అంటూ ఆ మధ్య చాలా హడావిడి చేసారు తెలుగుదేశం జనాలు.వైకాపా ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి టీడీపీ లోకి చేరే వ్యవహారం .
వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడు గా చెప్పబడే కొణతాల రామకృష్ణ టీడీపీ కి దగ్గరవడం ఇవన్నీ వైకాపా కి ఇబ్బంది కరమైన పనులే.
వీటికంటే పెద్ద దెబ్బలు వైకాపా మీద చూపాలి అనేది టీడీపీ ఎత్తుగడ సో చాలా ప్లాన్ లు వేసిందట.
సంక్రాంతి సందర్భంగా మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవాలనే ఆలోచనతో పెద్ద ‘ఆపరేషన్’ కూడా చేపట్టింది.అయితే, అనూహ్యంగా వైఎస్ జగన్ తన వ్యూహాలకు పదును పెట్టారు.
పార్టీ నుంచి, టీడీపీలోకి జంప్ చేయాలనుకునే నేతలతో సంప్రదింపులు జరిపారు.ఈ సంప్రదింపులు వర్కవుట్ అయ్యాయి.
తామెవరం పార్టీని వీడబోమంటూ, జంపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేతలు తెగేసి చెప్పారు.
దాంతో, టీడీపీ శ్రేణులు షాక్‌కి గురయ్యాయి.
మీ ఇష్టం ఎవరు కావాలంటే వారు రావచ్చు అంటూ బాహాటంగా టీడీపీ జనాలు చెబుతున్నా కూడా వైకాపా నుంచి ఒక్కరూ వెళ్ళలేదు అందులోకి.ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి తరవాత కుమ్మేస్తాం అంటున్నారు టీడీపీ వారు.
అటు వారిని ఇటూ ఇటు వారిని అటూ పంపించుకోవడం, కాపాడుకోవడం తప్ప వీరు చేస్తున్న ప్రజా సేవ ఏంటో ఆ దేవుడికే తెలియాలి.