విమర్శలపాలయినా .. జగన్ కు కలిసిరాబోతోందా ? 

ప్రస్తుతం వైసీపీతో పాటు,  ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు.

గత వైసిపి ప్రభుత్వం లోని తప్పిదాలను హైలెట్ చేస్తూ టిడిపి,  జనసేన,  బిజెపి కూటమి ప్రభుత్వం ఇరుకుని పెట్టె ప్రయత్నం చేస్తోంది .

ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది ఆ పార్టీకి రాజీనామా చేసి,  టిడిపి,  జనసేన లో చేరిపోయారు.ఇంకా ఈ చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఒకవైపు పార్టీని ప్రక్షాళన చేసి, ప్రజా పోరాటాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న జగన్ కు అనుకోని విధంగా తిరుమల లడ్డు వ్యవహారం తలనొప్పిగా మారింది.తిరుమల లడ్డు( Tirumala Laddu ) తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారని టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఆరోపణలు చేయడం తో,  జనాల్లోనూ ఈ విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.

ఒకరకంగా చెప్పాలంటే ఈ విషయంలో జగన్ పూర్తిగా విమర్శలు పాలు అయ్యారు.

Ys Jagan Mohan Reddy Gaining Sympathy In People Details, Ysrcp, Ap Government, A
Advertisement
Ys Jagan Mohan Reddy Gaining Sympathy In People Details, Ysrcp, Ap Government, A

వైసీపీకి కోలుకోవాలని దెబ్బ తిరుమల లడ్డు వ్యవహారం ద్వారా తగిలింది.గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో  చోటు చేసుకున్న పరిణామాలు సైతం జనాలు గుర్తుతెచ్చుకొని మరి లడ్డు తయారీలో తప్పు జరిగి ఉండవచ్చనే అభిప్రాయానికి వస్తూ ఉండడం వంటివన్నీ వైసిపికి ఇబ్బందికరంగానే మారాయి.అయితే పదేపదే లడ్డు వ్యవహారంలో జగన్ ను , వైసిపిని టార్గెట్ చేసుకొని టిడిపి,  జనసేన , బిజెపి తో పాటు తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేస్తుండడం వంటివన్నీ రాజకీయంగా రానున్న రోజుల్లో వైసిపికి( YCP ) కలిసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం గత ఎన్నికల్లో జగన్ కు దూరంగానే ఉంది.జగన్ వల్ల తమకు పెద్దగా మేలు జరగలేదని , ఆర్థికంగా నష్టపోయామనే అభిప్రాయం ఆ వర్గం నేతల్లో ఉంది.

  అయితే ఇప్పుడు జగన్ రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుండడంతో , రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా జగన్ కు అండగా నిలబడే అవకాశం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

Ys Jagan Mohan Reddy Gaining Sympathy In People Details, Ysrcp, Ap Government, A

అలాగే దళితులు,  మైనారిటీల్లో అత్యధిక శాతం మంది జగన్ విషయంలో సానుకూలంగా ఉన్నారని,  ఇటీవల ఆయనపై సింపతీ పెరిగిందనే అంచనాలు ఉన్నాయి.మతపరంగా జగన్ ను , వైసీపీని టార్గెట్ చేయడంతో ఆయా వర్గాల్లో జగన్ పై సానుభూతి కనిపిస్తోందని,  లడ్డు వివాదంతో జగన్ కు ఆ వర్గాలు మరింత చేరువవుతున్నాయని వైసిపి అంచనా వేసుకుంటోంది.లడ్డూ వివాదాన్ని ఎంతగా సాగదేస్తే అంత మేలు జరుగుతుందని వైసిపి అంచనా వేస్తోంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

జగన్ రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.కాలినడకన తిరుమలకు జగన్ చేరుకుంటారు.

Advertisement

డిక్లరేషన్ పేరుతో జగన్ ను అడ్డుకుంటే అది తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేసుకుంటోంది.

తాజా వార్తలు