రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అంటూ వైయస్ జగన్ కామెంట్స్..!!

ఏపీ వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అనేక దాడులు జరగడం తెలిసిందే.పోలింగ్ తర్వాత రోజే వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

YS Jagan Comments That Constitutional Systems Have Collapsed YSRCP, YS Jagan ,

ఇటీవల జూన్ 4వ తారీఖు ఫలితాలు అనంతరం .దాడులు మరింతగా పెరిగాయి.ఈ క్రమంలో వైఎస్ జగన్ సోషల్ మీడియాలో స్పందించారు.

"రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు( Chandrababu ) రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది.

Advertisement

టీడీపీ ( TDP)యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి.యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది.

వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు.పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది.

ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు.

ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది.గౌరవ గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.

బొంబాయి సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ బాలనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు వైసీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను".అని పోస్ట్ చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు