Shanmukh Jaswanth : వైద్య పరీక్షలలో… దొరికిపోయిన షణ్ముక్..!!

ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్( Shanmukh Jaswanth ) డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.షణ్ముక్ గంజాయి తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.

దీంతో షణ్ముక్ పై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.షణ్ముక్ యూరిన్ శాంపిల్ సేకరించగా.

గంజాయి పాజిటివ్ వచ్చింది.దీంతో అతడిపై నార్సింగి పోలీసులు( Narsingi Police ) కేసు నమోదు చేశారు.

విశాఖకు చెందిన మౌనిక అనే యువతి ఫిర్యాదుతో షణ్ముక్ తో పాటు అతడి సోదరుడు సంపత్ నీ( Sampath ) ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

విశాఖకు చెందిన మౌనిక( Mounika ) యూట్యూబర్ షణ్ముక్, సంపత్ పై సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.షణ్ముక్ సోదరుడు సంపత్ నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించడం జరిగింది.పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని శారీరకంగా వాడుకుని మరో యువతని పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

దీంతో సంపత్ నీ విచారణ చేయడానికి ఇంటికి వెళ్లగా షణ్ముక్ గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడటం జరిగిందట.

ఈ క్రమంలో షణ్ముక్ నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు( Medical Tests ) నిర్వహించగా.గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో షణ్ముక్ పై కూడా కేసు నమోదు అయింది.గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసు షణ్ముక్ పై నమోదయింది.

కాగా ఇప్పుడు మరోసారి అదే తరహాలో గంజాయి కేసు నిర్ధారణ కావడం సంచలనంగా మారింది.

న్యూస్ రౌండప్ టాప్ 20 
Advertisement

తాజా వార్తలు