సివిల్స్ లో సక్సెస్ సాధించాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.రేయింబవళ్లు తీవ్రస్థాయిలో శ్రమిస్తే మాత్రమే కోరుకున్న సక్సెస్ దక్కుతుందని చెప్పవచ్చు.
మూడు ప్రయత్నాల్లో సివిల్స్ లో( Civils ) ఫెయిల్ అయిన ఇద్దరు యువకులు నాలుగో ప్రయత్నంలో సక్సెస్ సాధించారు.మనిషి తలచుకుంటే సక్సెస్ కచ్చితంగా దక్కుతుందని ఖమ్మం జిల్లా యువకులు సాయికృష్ణ, సత్యసాయి మనోజ్ ప్రూవ్ చేశారు.
సరైన ప్రణాళికతో ముందుకు సాగుతూ ప్రిపేర్ అయితే ఏ పోటీ పరీక్ష అయినా సక్సెస్ సాధించడం సులువేనని వీళ్లు ప్రూవ్ చేశారు.యూపీఎస్సీ ఫలితాలలో ఖమ్మం జిల్లా యువకులు సాయికృష్ణ( Sai Krishna ) 293వ ర్యాంక్ సాధించగా సత్యసాయి మనోజ్( Satyasai Manoj ) 559 ర్యాంక్ సాధించారు.
కొత్తగూడెంకు చెందిన ఈ యువకులు వారి గెలుపు ప్రణాళిక గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం.

సాయికృష్ణ తండ్రి టౌన్ లోని ఒక లాడ్జికి మేనేజర్ గా పని చేస్తుండగా తల్లి నాగలక్ష్మి( Nagalakshmi ) గృహిణిగా పని చేస్తున్నారు.సాయికృష్ణ కుటుంబం ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తోంది.సాయికృష్ణకు మంచి ర్యాంక్ రావడంతో అతని కుటుంబం స్థితిగతులు మారిపోతాయేమో చూడాలి.
రోజుకు పది గంటల చొప్పున కష్టపడి చదివానని సాయికృష్ణ అన్నారు.

తాను మూడేళ్ల పాటు కష్టపడి చదివానని సాయికృష్ణ వెల్లడించారు.సత్యసాయి మనోజ్ విషయానికి వస్తే మనోజ్ తండ్రి పోలీస్ డిపార్టుమెంట్ లో డీఎస్పీగా పని చేసి రిటైర్ అయ్యారు.సాయికృష్ణ, మనోజ్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సాయికృష్ణ, మనోజ్ తమ టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.రాబోయే రోజుల్లో సాయికృష్ణ, మనోజ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
వీళ్లిద్దరి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం.రాబోయే రోజుల్లో వీళ్లిద్దరూ కెరీర్ పరంగా మరింత ఎదుగుతారేమో చూడాల్సి ఉంది.







