ఎప్పటికైనా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కావాల్సిందే.. విమర్శిస్తే టీడీపీకే నష్టమంటూ?

చంద్రబాబు నాయుడు( N Chandrababu Naidu ) అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.

బాలయ్య లేదా లోకేశ్ ( Nara Lokesh )టీడీపీ బాధ్యతలు తీసుకున్నా పార్టీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం సులువైన విషయం కాదు.

జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) ప్రస్తుతం టీడీపీకి దూరంగా ఉన్నా ఎప్పటికైనా టీడీపికి జూనియర్ ఎన్టీఆర్ కావాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శిస్తే తెలుగుదేశం పార్టీకే నష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన వాక్చాతుర్యంతో తారక్ సులువుగా ప్రజలకు దగ్గర కావడంతో ప్రజల మనస్సులను గెలుచుకోగలరు.

ఇతర పార్టీల నేతల విమర్శలకు ధీటుగా స్పందించేంత టాలెంట్ యంగ్ టైగర్ ( Jr ntr )జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ పదేపదే విమర్శలు చేయడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది.

Advertisement

టీడీపీ నేతల విమర్శల వల్ల జూనియర్ ఎన్టీఆర్ సైతం టీడీపీకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.చంద్రబాబు,. బాలయ్య( Nandamuri Balakrishna ) చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) ప్రస్తుతం సినిమాల్లోనే కెరీర్ ను కొనసాగిస్తూ సినిమాలకే పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు.ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాకు సంబంధించిన అండర్ వాటర్ సీక్వెన్స్ లో పాల్గొంటున్నారు.

ఈ సీక్వెన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది.జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు