పెరుగుతున్న టెక్నాలజీ మనిషికి అనేక రకాలుగా ఉపయోగపడుతూనే, మరెన్నో అరాచకాలకు కారణం అవుతుంది.ముఖ్యంగా నేటి యువత డబ్బులు సంపాదించడం కోసం షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు.
దానికి యూట్యూబ్ ని వేదికగా చేసుకుంటున్నారు.ఇక నేడు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ వినియోగానికి అలవాటు పడ్డారు.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది వ్యసనంలాగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు.ఉదయం లేచిన మొదలుకుని రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్స్ లోనే సమయం గడిపేస్తున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియా వాడకం కూడా అధికంగా పెరిగింది అయింది.
అదే అదనుగా చేసుకొని కొందరు పోకిరిగాళ్లు, ట్రెండింగ్ కోసం పిచ్చి పిచ్చి ఫ్రాంక్ వీడియోలు చేస్తు్న్నారు.
దాంతో వీరు రాత్రి రాత్రికే స్టార్స్ గా మారిపోతున్నారు.అయితే ఈ క్రమంలో కొన్ని అపశృతులు చోటుచేసుకుంటున్నాయి.
ట్రెండీగా మారేందుకు కొందరు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కూడా అలజడులు సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు.దారినపోయే వారితో హద్దులు మీరి ఫ్రాంక్ లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
మరికొందరైతే బోల్డ్ ఫ్రాంక్స్ చేస్తూ కూడా ఆదాయం సమకూర్చుకుంటున్నారు.

ఇదివరకు ఇలాంటి ఫ్రాంక్ లు మహానగరాలు అయినటువంటి హైదరాబాద్, ముంబయి, కోలకతా, దిల్లీ వంటి నగరాలకే పరిమితం అయ్యేది.కానీ ఇప్పుడు ఆ పిచ్చి చేష్ఠలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి.తాజాగా ప్రజలను ఫ్రాంక్ ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్న పలువురు యువకులు కటకటాల పాలుచేసింది.
వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా పలమనేరులో మిక్కిమౌస్, టెడ్డీ బేర్ వేషధారణలో వచ్చి కళాశాలలు, పాఠశాల వద్ద యువతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే వారి భవిష్యత్ దృష్ట్యా వారిమీద కేసు పెట్టకుండా హెచ్చరించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు.







