యాపిల్ కంపెనీపై కుర్రాడి పరువునష్టం దావా! అసలు కారణం ఇదే.

అమెరికాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌పై ఓ కుర్రాడు పరువునష్టం దావా వేశాడు.

తనని దొంగగా చిత్రీకరించి, తన వివరాలను యాపిల్‌ స్టోర్లలో ఉంచినందుకు 7000 కోట్లు పరిహారంగా చెల్లించాలంటూ న్యాయస్థానంని ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళ్తే 18 సంవత్సరాల వయసు గల ఔస్మేన్ బా తన యాపిల్‌ ఫోన్‌లో ఫేస్‌ డిటెక్షన్‌ ద్వారా ఫోన్‌ లాక్‌ తెరుచుకునేలా సెట్టింగ్స్ చేసుకున్నాడు.తరువాత యాపిల్ స్టోర్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడంటూ ఆయా స్టోర్ల వద్ద వేరొకరి ఫొటోతో ఇతని వివరాలను ముద్రించారు.

బా ఫేస్‌ డిటెక్షన్‌తో ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు ఉపయోగించిన డేటాను అసలు దొంగ కాజేసి.ఫేస్‌ డిటెక్షన్‌ సాఫ్ట్‌వేర్‌లో తన ఫొటోకు బా పేరుతో పాటు మొత్తం వివరాలను లింక్ చేసి యాపిల్‌ స్టోర్లకు వెళ్లి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

అందువల్ల అతను చేస్తున్న దొంగతనాలకు బాను పోలీసులు చాలా సార్లు ప్రశ్నించేవారు.ఇలా చేయని తప్పులకు నిందితుడిగా ముద్ర వేయడం వలన తీవ్ర మనో వేదనకు గురైనట్లు బా ఇందుకు కారణమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, వినియోగంలో ఉంచిన యాపిల్‌ సంస్థ సమాధానం చెప్పి తీరాలని, తనకు ఒక బిలియన్‌ డాలర్లను నష్ట పరిహారంగా చెల్లించాలని కోరుతూ మాన్‌హట్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేశాడు.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు