వచ్చిన అవకాశాలు చేతులార నాశనం చేసుకుంటున్న ఫిదా బ్యూటీ

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆమె డాన్స్ టాలెంట్, పెర్ఫార్మెన్స్ అతి తక్కువ టైంలోనే ఆమెని క్రేజీ హీరోయిన్ గా మార్చేశాయి.ఇక టాలీవుడ్ ఆడియన్స్ చాలా కాలం తర్వాత ఒక హీరోయిన్ ని పిచ్చిగా అభిమానించారంటే అది సాయి పల్లవినే అని చెప్పాలి.

 Sail Pallavi Refuse The Movie Offers-TeluguStop.com

ఓ విధంగా ప్రస్తుతం ఆమె అదే స్పీడ్ లో వరుస సినిమాలు చేసి ఉంటే టాలీవుడ్ లో సాయి పల్లవి పేరు మార్మోగిపోయి, స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ వచ్చి ఉండేది.కాని ఆమె ఐడియాలజీ పూర్తిగా డిఫరెంట్.

ఈ కారణంగా తెలుగులో ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలకే పరిమితం అయ్యింది.ఇదిలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబుకి జోడీగా నటించే అవకాశం సాయి పల్లవికి వచ్చిన ఈ భామ ఊహించని విధంగా దర్శకుడుకి నో అని చెప్పి షాక్ ఇచ్చింది.

కథలో తన పాత్రకి సరైన ప్రాధాన్యత లేదని మొహమాటం లేకుండా చేయనని చెప్పేసింది.ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అవగా తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆమె ఇంటెన్సన్ ఏంటో తెలియజేసింది.

సామాజిక స్పృహ కలిగిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించాలన్నది తన కోరికని, అలాంటి కథా బలమున్న చిత్రంలో నటించే అవకాశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని సాయి పల్లవి చెప్పింది.ఒకవేళ అలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తన దగ్గరికి రాకపోతే, సినిమాల నుంచి మెల్లిగా తప్పుకుని డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకుంటానని గట్టిగానే చెప్పేసింది.

దీంతో ఆమె అడియాలజీ రెగ్యులర్ హీరోయిన్స్ కి పూర్తి భిన్నంగా ఉందని మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube