పెళ్లిచేసుకోబోయే ముందు...మీకు కాబోయే వారిని తప్పక అడగాల్సిన 5 ప్రశ్నలు ఇవే.!

పెళ్లికి ముందు చాలా మంది పెళ్లిచేసుకోబోయే వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటారు.అందులో ముఖ్యంగా మీరు అడగాల్సిన 5 ప్రశ్నలు

1.

మీకు ఇది వరకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి

ప్రప్రథమంగా అందరు అడిగేది, మీకు లవర్ ఉన్నారా? లేరు అంటే ఎవ్వరు నమ్మరు ఈ కాలం లో, కనుక ఉంటే ఉన్నారు అని చెప్పేయండి.పెళ్లి చూపులకి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా మీది బ్రేకప్ అయి ఉంటుంది కనుక, మిమ్మల్ని పెళ్లి చేసుకొనే వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

2.మీ సంపాదన అప్పులు

మీరు ఎంత సంపాదిస్తున్నారో, మీకు వ్యక్తిగతంగా ఎంత మొత్తం లో అప్పు ఉందో (ఎడ్యుకేషన్ లోన్, కార్ లోన్, హౌస్ లోన్) ఇలా ఎవైనా ఉంటే మీరు పెళ్లి చేసుకోబోయే వారికి ఖచ్చితంగా తెలుపండి, ఎందుకంటే పెళ్లి అయ్యాక నీకు ఇంత మొత్తం లో అప్పు ఉందని ముందే ఎందుకు చెప్పలేదు అని కొట్లాటలు మొదలయ్యేదానికి ఆస్కారం వుంటుంది కనుక.

3.అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నా తమ్ముడు

మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఎంత సేపు టైం స్పెండ్ చేస్తారో, మీ ఇంట్లో వాళ్ళు అంటే మీకు ఎంత ఇష్టమో మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ముందే తెలుపండి.

ఎందుకంటే పెళ్లి తరువాత మళ్ళీ నువ్వు నీ కుటుంబంకు ఇంత దెగ్గరగా ఉంటావాని ముందే ఎందుకు చెప్పలేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు.

You Should Ask These 5 Questions Before You Marry To Your Partner

4.పిల్లల విషయం లో

మీరు ఏ సమయానికే పిల్లల్ని కనాలి అనేది కూడా పెళ్లికి ముందే మాట్లాడుకోవాలి, ఎందుకంటే పెళ్లి అయిన వెంటనే ఇప్పుడే మనకు పిల్లలు వద్దు కొన్నేళ్లు ఆగుదాం అని మీ భాగస్వామి మీతో అంటే మీరు అప్పుడు ఎంతో బాధకి గురవుతారు.అందుకే పెళ్లికి ముందే ఒక క్లారిటీ కి రావాలి.

5.అతి ముఖ్యమైనవి దోస్తాన, దారు

ఫ్రెండ్స్ తో ఎలా ఉంటారో, పెళ్లి తరువాత ఎలా ఉంటారనేది ముందే చెప్పండి.

Advertisement
You Should Ask These 5 Questions Before You Marry To Your Partner-పెళ్�

మీకు తాగుడు అలవాటు ఉంటే, ఎంత మొత్తం లో తగుతారు అనేది, మీరు ఫ్రెండ్ షిప్ కి ఎటువంటి విలువ ఇస్తారు అనే విషయం కూడా మీ భాగస్వామి కి పెళ్లికి ముందే తెలుపండి.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు