మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!

ఎక్కువ స‌మ‌యం పాటు నిల‌బ‌డాల‌న్నా, కూర్చోవాల‌న్నా, ఏదైనా ప‌ని చేయాల‌న్నా వెన్నెముక బ‌లంగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం.పొర‌పాటున వెన్నెముక ఆరోగ్యం క్షీణించిందా.

ఇక నాలుగు అడుగులు వేయ‌డానికి కూడా ఓపిక ఉండదు.అందుకే మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన వెన్నెముక‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తుంటారు.

అయితే కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగ్గా మార్చుకోవ‌చ్చు.మరి ఇంకెందుకు ఆల‌స్యం వెన్నెముక కోసం ఏయే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో చూసేయండి.వెన్నెముక స‌మ‌స్య‌ల‌కు చెడు భంగిమ ఒక కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

ఎలా ప‌డితే అలా కూర్చోవ‌డం, నించోవ‌డం చేస్తే వెన్నెముక‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది.అందుకే ఎప్పుడూ నిటారుగానే నిల‌బ‌డ‌టం లేదా కూర్చోవ‌డం చేయాలి.

Advertisement
You Need To Take These Precautions To Keep Your Spine Strong! Spine, Strong Spin

మ‌రియు నిద్రలో పడుకొనే భంగిమ కూడా సక్రమంగా ఉండాలి.కాల్షియం, ప్రోటీన్ వంటి పోష‌కాలు వెన్నెముక‌ను ఆరోగ్యంగా మ‌రియు బ‌లంగా మారుస్తాయి.

కాబ‌ట్టి, కాల్షియం, ప్రోటీన్ పుష్క‌లంగా పాలు, పెరుగు, ఆకుకూర‌లు, నువ్వులు, బాదం, బీన్స్‌, అవ‌కాడో, చేప‌లు, గుడ్లు వంటి ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.అదే స‌మ‌యంలో చెడు ఆహారాలు అంటే ఫాస్ట్ ఫుడ్స్‌, బేక్డ్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్‌, ప్యాక్డ్ ఫుడ్స్‌ను, సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిని డైట్‌లో నుంచి క‌ట్ చేయాలి.

You Need To Take These Precautions To Keep Your Spine Strong Spine, Strong Spin

అలాగే వెన్నెముక ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలో వ్యాయామాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ప్ర‌తి రోజు క‌నీసం ఇర‌వై నిమిషాలైనా వ్యాయామాలు చేస్తే ఎముకల‌ సాంద్రత పెరుగుతుంది.త‌ద్వారా ఎముకల వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.ముఖ్య‌గా వెన్నెముక స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

వ్యాయామాలు చేయ‌లేని వారు యోగాస‌నాలు కూడా వేయ‌వ‌చ్చు.త‌ద్వారా కూడా మంచి ఫ‌లితాలే ల‌భిస్తాయి.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

హై హీల్ చెప్పులు ధరించడం వ‌ల్ల వెన్నెముక ఆరోగ్యం తీవ్రంగా పాడ‌వుతుంది.అందు వ‌ల్ల‌, హై హీల్ చెప్పులకు బదులుగా ఫ్లాట్‌గా ఉండే చెప్పుల‌నే ధ‌రించాలి.

Advertisement

ఇక ఫోన్లు, టీవీలు అధికంగా చూడ‌టం మానుకోవాలి..

తాజా వార్తలు