Ajith Kumar : హీరో అజిత్ చాలా స్పెషల్.. అందుకే ఏకంగా ఆర్మీ కాంట్రాక్ట్ దక్కింది..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్( Ajith Kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు.తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్ స్టైలే వేరు.

పర్సనల్‌గా ఫోన్ ఉపయోగించని ఏకైక హీరో ఎవరంటే అజిత్ అనే చెప్పాలి.ఇప్పటి జనరేషన్ లో కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు.

కనీసం అతనికి అభిమాన సంఘాలు కూడా ఏమీ లేవు.స్వయంగా అజితే అవేమీ వద్దని రద్దు చేశాడు.

Advertisement

ప్రస్తుత జనరేషన్‌లో సినిమా విడుదల కాకముందే ఫ్యాన్స్ హంగామా మొదలవుతుంది.అలాంటిది అజిత్ మాత్రం అవేమి వద్దు అని అధికారిక ఫ్యాన్స్ సంఘాలను రద్దు చేసేసాడు.

అసలు హీరో అంటే గంట గంటకి హెయిర్ టచ్అప్, మీసాలు ట్రిమ్మింగ్ చెయ్యడానికి ఒక అసిస్టెంట్, కొత్త ట్రెండీ బట్టలు వేసుకోవాలి, క్యారవాన్ నుంచి బయటికి రారు, ఎం కావాలన్నా వాళ్ళ కాళ్ళ దగ్గరకే రప్పించుకుంటారు.కానీ అజిత్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు.

కనీసం ఆయన నెరిసిన జుట్టుకి రంగు కూడా వెయ్యడు, ముఖానికి మేకప్ వేసుకోడు.హీరోలందరిలో భిన్నంగా ఉంటాడు అజిత్.

అయితే అజిత్ పుట్టింది హైదరాబాదులోనే.అతని తండ్రి తమిళ బ్రాహ్మిణ్, తల్లి సింధీ.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

అజిత్ చదివింది పదవ తరగతి అయినప్పటికీ తమిళ్, తెలుగు,మలయాళం, కన్నడం, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతాడు.అతని సినిమాలకు అతనే డబ్బింగ్ చెప్పుకుంటాడు.

Advertisement

హీరోయిజం చూపించని మంచి వ్యక్తి.ఇండస్ట్రీ కి రాకముందు అజిత్ ఒక వెహికల్ మెకానిక్.

ఆ తర్వాత డ్రైవర్ గా చేశాడు.అతను ఒక రేస్ కార్ల పోటీదారుడు.

ఎన్నో జాతీయ కార్ల రేస్ లో అజిత్ పార్టిసిపేట్ చేశాడు.

ఇక బైక్ రైడింగ్ అంటే అజిత్ కి చాలా ఇష్టమని చెప్పాలి.అయితే అజిత్ మంచి కార్ రేసరే కాకుండా, మంచి షూటర్ కూడా.ఆగస్టు రెండో తారీకు చెన్నై లో జరిగిన స్టేట్ లెవెల్ షూటింగ్ పోటీలకు 900 మంది వరకు హాజరయ్యారు.

చెన్నై రైఫిల్ క్లబ్ మెంబర్( Chennai Rifle Club ) అయిన అజిత్ ఏకంగా ఆరు మెడల్స్ ని దక్కించుకున్నాడు.అజిత్ రకరకాల విభాగాల్లో తన సత్తా చాటుకున్నాడు.

ఇక అజిత్ ఇండస్ట్రీలోనే కాకుండా వ్యాపార పరంగా కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు.అతని ఆధ్వర్యంలో దక్ష అనే ఒక సంస్థ ఉంది.

ఆ సంస్థ డ్రోన్ల తయారీకి పెట్టింది పేరు.ప్రస్తుతం ఆ సంస్థకు భారత రక్షణ శాఖ నుండి ఒక కాంట్రాక్టు దక్కింది.

ఆ వివరాల్లోకి వెళితే మన సైన్యానికి అవసరమైన డ్రోన్లు తయారీ చెయ్యమని దిశ సంస్థకు( Daksha Group ) కాంట్రాక్టు ఇచ్చింది.దాదాపు 200 డ్రోన్లు, 165 కోట్ల ప్రాజెక్ట్ ఇది.ఆ డ్రోన్ల( drones )ను పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం ఉపయోగిస్తారు.అలానే విపత్తు సమయంలో ఎదుటి వారికి సహాయం చేయడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి.

చెన్నై ఐఐటి విద్యార్థులు కొంతమంది అజిత్ నేతృత్వంలో ఒక టీమ్ గా ఏర్పడి ఈ కాంట్రాక్ట్ కోసం పని చేస్తున్నారు.

తాజా వార్తలు