సూర్యుడు అనుగ్రహం పొందాలంటే ఆదివారం ఈ చిన్న పని చేయాల్సిందే!

మన జీవితంలో నిత్యం ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి .ఎన్ని ప్రయత్నాలు చేసిన సమస్యలకు పరిష్కార మార్గం దొరకక చాలామంది సతమతమవుతుంటారు.

ఎటువంటి సమస్యకైనా జ్యోతిష్య శాస్త్రంలో కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది.జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 9 గ్రహాలలో సూర్యునికి ప్రథమ స్థానం ఉంది.

జాతకంలో సూర్యుని అనుగ్రహం తక్కువగా ఉండటం వల్ల తరచు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటి అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇటువంటి సమస్యలకు సూర్యుడినీ పూజించడం మాత్రమే పరిష్కారంగా భావిస్తారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎన్ని ప్రయత్నాలు చేసిన సమస్యలకు పరిష్కారం లభించకపోతే సూర్యుడినీ పూజించడం మాత్రమే ఒకే ఒక పరిష్కారం.సూర్యుడికి ఆదివారం చాలా ఇష్టమైన వారంగా పరిగణిస్తారు.సూర్యుడి అనుగ్రహం పొందాలంటే ఆదివారం రోజు ఉపవాసం చేసి నిష్టగా సూర్యుడిని పూజించాలి.12 ఆదివారాలు క్రమం తప్పకుండా ఎంతో నిష్టగా ఉపవాసముండి సూర్యుడిని ఆరాధించడం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుంది.

You Have To Do This Little Work On Sunday To Get The Sun Blessed , Sun Blessed ,
Advertisement
You Have To Do This Little Work On Sunday To Get The Sun Blessed , Sun Blessed ,

సూర్యుడి అనుగ్రహం కోసం ప్రతి రోజూ ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించి తరువాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మూడుసార్లు పఠించడం ద్వారా ఫలితం లభిస్తుంది.ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరించి, ఉపవాసం ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.ఉపవాసం చేసే సమయంలో ఆహారంలో ఉప్పు తీసుకోరాదు.

బెల్లంతో చేసిన గోధుమ రొట్టె లేదా గోధుమ గంజిని మాత్రమే తీసుకోవాలి.మీ జాతకంలో సూర్యుడు అనుగ్రహం బలహీనంగా ఉంటే ఆదిత్య స్తోత్రాన్ని కచ్చితంగా పఠించాలి.

ఆదివారం ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

తాజా వార్తలు