ఓడినా కేంద్రం లో  వైసీపీ కీలకమే ! జగన్ కు అదే పెద్ద ఊరట 

కేంద్రంలోనూ , ఏపీలోనూ ఎన్డీఏ కూటమి( NDA Alliance ) అధికారంలోకి వచ్చింది.

ముఖ్యంగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి , జనసేన, బిజెపి కూటమి ఘనవిజయం సాధించగా, వైసిపి( YCP ) 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయింది.

ఈ స్థాయిలో ఘోర ఓటమి వైసిపికి ఎదురవుతుందని ఎవరు ఊహించలేదు.ఎన్నికల ఫలితాలకు ముందు కొన్ని ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినా,  వాటిని ఎవరు నమ్మలేదు.

తిరుపతి,  రాజంపేట .అరకు,  కడప పార్లమెంట్ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు గెలిచారు.దీంతో కేంద్రంలోని ఎన్డీఏ కు జగన్( Jagan ) అవసరం ఉండదని,  రాజకీయంగా జగన్ ఇబ్బంది పెడతారని , గతంలో ఉన్న కేసులను మళ్ళీ వెలికి తీస్తారని,  అంతా భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) కేంద్ర బిజెపి పెద్దలపై ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు.అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు.

Advertisement

  దీనికి కారణం ప్రస్తుతం బిజెపికి స్వల్ప మెజారిటీ మాత్రమే దక్కింది  కేవలం 240 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది .దీంతో మిత్ర పక్షాల అవసరం చాలానే ఉంది.అలాగే బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా ఉంది.

ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ఓడించి అక్కడ బిజెపి అధికారంలోకి రావడం ,ఎన్నికల ప్రచారంలో నవీన్ పట్నాయక్ పై నరేంద్ర మోది( Narendra Modi ) వ్యక్తిగత విమర్శలు చేయడం తదితర కారణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు.  దీంతో ఇతర పార్టీల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు మోదికి  అవసరం.

వైసిపికి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం,  టిడిపికి( TDP ) ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడంతో,  ఇప్పుడు వైసిపి కీలకంగా మారుతుంది.వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ కు వచ్చిన ముప్పేమి కనిపించడం లేదు.ఎందుకంటే ఇప్పుడే రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు.2026 జూన్ నెలలకు నాలుగు స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జూన్ 21వ తేదీ వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ , పిల్లి సుభాష్ చంద్రబోస్ , ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ పదవి కాలం పూర్తవుతుంది జూన్ 2026 కానీ నాలుగు రాజ్యసభ స్థానాలని కోటము ఖాతాలోని పడతాయి.2028 నాటికి వైసిపి కి చెందిన మరో రాజ్యసభ పదవులు ఖాళీ అవుతాయి జూన్ 21 2028 నాటికి బీద మస్తాన్రావు నిరంజన్ రెడ్డి ఆర్ కృష్ణయ్య విజయ్ సాయి రెడ్డి పదవీకాలం ముగుస్తుంది.మిగిలిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవి కాలం అప్పుడే పూర్తవు దీంతో వై సిపి సభ సభ్యుల మద్దతు కేంద్రానికి తప్పనిసరిగా అవసరం అవుతుంది.

Advertisement

ఈ లెక్కన చూసుకున్నా,  జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి కనిపించబోతోంది.

తాజా వార్తలు