ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్ధులుగా బిజెపి, వైసిపి లు ఉన్నాయి ఈ క్రమంలో గతంతో పోలిస్తే ఏపీ అధికార పార్టీ వైసీపీ పై విమర్శలు డోసు బీజేపీ నేతలు పెంచారు.ముఖ్యంగా ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు .
ఆ పార్టీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ నరసింహారావు , లంకా దినకర్ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది బీజేపీ నేతలే విమర్శలు చేస్తున్నారు .వీరు సరిపోరు అన్నట్టుగా ఏపీకి వివిధ పర్యటన నిమిత్తం వస్తున్న కేంద్ర మంత్రులు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.అయినా వారిని గట్టిగా విమర్శించ లేని పరిస్థితుల్లో వైసిపి నిస్సహాయంగా ఉండిపోతుంది.ఏపీ బీజేపీ నేతలకు అప్పుడప్పుడు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్న.కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు చేస్తున్న విమర్శలకు మాత్రం మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తోంది .
ఇటీవలే ఏపీ పర్యటన నిమిత్తం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఏపీ లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో పర్యటించారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫ్లెక్సీలలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేక పోవడాన్ని ఆమె నిలదీస్తున్నారు.తన పర్యటనలో వెంట వస్తున్న వైసిపి నాయకులు, మంత్రులు అధికారులను ఇదే విషయమై ఆమె ప్రశ్నించారు.
మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించిన ఆమె వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శించడమే పనిగా వ్యవహరించారు.ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మౌనంగా ఉండిపోవడం తప్ప గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
కేంద్ర మంత్రి వెంట ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కూడా ఉన్నారు.

అయినా కేంద్ర మంత్రి విమర్శలు చేస్తున్న సమయంలో రజిని సరైన సమాధానం చెప్పలేక పోయారు. ఆమె చేస్తున్న విమర్శలకు ఔను అని కానీ, కాదు అని కాని సమాధానం చెప్పలేక మంత్రి రజినీ, అధికారులు ఇబ్బందులు పడ్డారు.బీజేపీ కాకుండా టిడిపి నేతలు ఎవరైనా చిన్నపాటి విమర్శలు చేసినా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్య నాయకులంతా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
కానీ బీజేపీ విషయంలో మాత్రం వైసీపీకి ఆ ఆప్షన్ లేకుండా పోయింది.