జ‌గ‌న్ క్లాస్‌తో హైద‌రాబాద్‌కు జంప్ అయిన వైసీపీ ఎంపీ ?

వైసీపీలో వివాద ర‌హిత ఎంపీగా గుర్తింపు పొందిన విశాఖ ప‌ట్నం ఎంపీ.సినీ నిర్మాత‌, పారిశ్రామిక వేత్త ఎంవీ వీ స‌త్య‌నారాయ‌ణ‌కు పార్టీ అధిష్టానం క్లాస్ ఇచ్చింద‌నే వార్త‌లు విశాఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్చ‌ల్ చేస్తున్నా యి.

ఆయ‌నపై అనూహ్యంగా సీఎం జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు.విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో అంద‌రూ క‌లిసి పోరాడాల‌ని స్వ‌యంగా జ‌గ‌నే ఆదేశించారు.

అయితే.ఎంపీ స‌త్య‌నారాయ‌ణ ఈ విష‌యంలో ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.

ఆయ‌న‌పై వ‌స్తున్న ఒత్తిడిని త‌ట్టుకోలేక పోతున్నార‌ని తెలుస్తోంది.ముఖ్యంగా టీడీపీ నుంచి ఎదుర‌వుతున్న తీవ్ర విమ‌ర్శ‌లు, ఒత్తిడులు ఎంపీపై ప్ర‌ధానంగా ప‌నిచేస్తున్నా యి దీంతో ఆయ‌న ఏకంగా ఎంపీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇది పార్టీలో చ‌ర్చ‌నీ యాంశం గా మారింది.అదే స‌మ‌యంలో త‌ను వ్య‌క్తిగ‌తంగా కూడా ఉద్య‌మాన్ని న‌డిపిస్తానంటూ.

Advertisement
YCP MP Satya Narayana Angry On Jagan ,ap,ap Political News, ,M V V Satya Narayan

కౌంట‌ర్ ఇచ్చారు.ఈ ప‌రిణామాల‌పై వైసీపీలో చ‌ర్చ సాగింది.

మ‌రోవైపు కీలక నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి.పాద‌యాత్ర చేయ‌డం.

ఈ విష‌యంలో ఎంపీ భిన్న‌మైన వైఖ‌రితో ఉండ‌డంతో పార్టీలో ఎంపీ సెంట్రిక్‌గా వివాదం త‌లెత్తింది.

Ycp Mp Satya Narayana Angry On Jagan ,ap,ap Political News, ,m V V Satya Narayan

ఈ నేప‌థ్యంలోనే వైసీపీ కేంద్ర నాయ‌క‌త్వం.ఎంపీ స‌త్య‌నారాయ‌ణ దూకుడు త‌గ్గించాలంటూ.మౌఖిక ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

పైగా.రాజీనామా అంటూ.

Advertisement

కొత్త వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని కూడా ఆదేశించింది.ఈ ప‌రిణామాలతో ఒకింత అలిగిన స‌త్య‌నారాయ‌ణ విశాఖ ఉద్య‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే హైద‌రాబాద్ టూర్ పెట్టుకున్నార‌ని తెలిసింది.

ఇక్క‌డ ఉండ‌డం క‌న్నా.కూడా హైద‌రాబాద్‌కు వెళ్లి రిఫ్రె ష్ అయిరావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

మ‌రి ఈ ప‌రిణామం ఎటు దారితీస్తుందో చూడాలి.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

తాజా వార్తలు