తెలంగాణ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఏపిలో వస్తారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు.బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో వైకుంఠ ద్వారం గుండా మల్లాది విష్ణు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదాలు అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.
సీఎం జగన్ సుపరిపాలనలో భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ప్రగతి సాధించిందన్నారు.
వ్యవసాయ,మహిళా, విద్యారంగాల్లో నూతన సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు.
ఎన్నికలు ఏదైనా, విజయం మాత్రం వైసీపీ పార్టీని వరిస్తుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేసారు.సిద్ధాంతాం లేని రాజకీయ పార్టీలు, ఎల్లో మీడియా వైసీపీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఇంతటి సుపరిపాలన ఇవ్వడం ఇదే ప్రధమంమన్నారు.త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు కాబోతుందని, జిల్లా పునర్వ్యవస్థీకరణ చేసి ప్రజలకు కలెక్టర్లు.
, కలెక్టరేట్లు అందుబాటులో ఉండేలా చేసాంమన్నారు.వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చేపడుతున్నాంమని చెప్పిన ఆయన,
ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు పూనినా వైసీపీ అధికారంలోకి రావడం తధ్యంమని చెప్పారు.సంక్షేమం, పరిపాలన వికేంద్రీకరణ అని అంశాలను చెప్తూనే ప్రజలు వద్దకు వెళ్తున్నట్లు చెప్పారు.వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి మరింత సులువుగా ప్రజలకు సంక్షేమ పధకాలు అందిస్తున్నాంమని, జగన్ నాయకత్వం పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
బిఆర్ఎస్ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, తెలంగాణ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఎపిలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు.రాయలసీమ ఎత్తిపోతల పధకం ఆపిందె వాళ్ళని, టీడీపీ వాల్లే దాడి చేసి, వాల్లే ఎదురు తిరిగి ప్రభుత్వంపై యెల్లో మీడియా ద్వారా తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆయన విమర్శించారు.