పవన్ చదువుకొని ఉంటే ఈ బాధలుండేవి కావు.. వైసీపీ మంత్రులు ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్లు నెట్టింట చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికావని ప్రజలపై భారం వేస్తే ప్రభుత్వం ఊరుకోదని చెప్పారు.

డిస్ట్రిబ్యూటర్లు అడగటం వల్లే ఆన్ లైన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నామని పవన్ కు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.మరో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ పవన్ కు ఏపీలో ఎన్ని సీట్లు వచ్చాయని ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పవన్ కేవలం ఒక్క సీటులో మాత్రమే గెలిచారని తెలిపారు.

పవన్ లాంటి వాళ్లను ప్రభుత్వం చాలామందిని చూసిందని పవన్ చేసే కామెంట్లలో పొంతన లేదని రేట్లు పెంచి అమ్మే టికెట్లపై ట్యాక్స్ ఎక్కడికి పోతుందని అనిల్ కుమార్ ప్రశ్నించారు.పవన్ అయినా సంపూర్ణేష్ అయినా తమకు తేడా లేదని అనిల్ కుమార్ అన్నారు.

మరో వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ తన సినిమాలను ఏపీలో ఎందుకు షూట్ చేయరని ప్రశ్నించారు.

Ycp Ministers Sensational Comments Actor Pawan Kalyan Details, Interesting Comm
Advertisement
Ycp Ministers Sensational Comments Actor Pawan Kalyan Details, Interesting Comm

టికెట్ల ఆన్ లైన్ విధానం గురించి పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.పవన్ చేసే విమర్శలు సహేతుకంగా ఉండాలని పది రోజులు పవన్ ధ్యాన కేంద్రంలో గడిపితే మంచిదని అవంతి శ్రీనివాస్ అన్నారు.మరో మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ సాయితేజ్ విషయంలో తిట్టాల్సింది మీడియాను కాదని దమ్ముంటే కేసీఆర్ ను, తెలంగాణ పోలీసులను తిట్టాలని సూచనలు చేశారు.

Ycp Ministers Sensational Comments Actor Pawan Kalyan Details, Interesting Comm

తనకు కూడా చిరంజీవి అంటే అభిమానమని పేర్ని నాని అన్నారు.చదువుకునే రోజులలో చిరంజీవి పోస్టర్లకు దండలు వేయడం, చిరంజీవి సినిమాలు చూడటం చేసేవాళ్లమని పేర్ని నాని చెప్పుకొచ్చారు.చిరంజీవిని అన్నయ్య అని పిలుచుకునేవాళ్లమని సురేఖమ్మను వదినమ్మ అని పిలుచుకునే వాళ్లమని పేర్ని నాని వెల్లడించారు.

సురేఖమ్మ చెప్పిన విధంగా చదువుకుని ఉంటే పవన్ కు ఈ బాధలు ఉండేవి కావని పేర్ని నాని కామెంట్లు చేశారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు