ఆన్ లైన్ క్లాస్ లకు సంబంధించి వైసీపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో పాఠశాల రీ ఓపెనింగ్ విషయం గురించి సంచలన కామెంట్ చేశారు.

రాష్ట్రంలో ఈ నెల 16వ తారీకు నుండి పాఠశాలలు రీ ఓపెన్ చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

అన్ని తరగతులకు యధాతథంగా పాఠశాల సమయం వర్తింపజేస్తూ.కోవిద్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.

అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం మంది స్కూల్ టీచర్లకు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.ఇక మిగిలిఉన్న టీచర్లకు కూడా త్వరగా వ్యాక్సింగ్ వేసేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

ఇక ప్రైవేట్ స్కూల్ ఆన్ లైన్ తరగతులు నడపొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్ లైన్ తరగతులు ఎక్కడ జరగడం లేదని అన్నారు.

Advertisement

అదే రీతిలో ప్రతి స్కూల్ రీఓపెనింగ్ ముందు శానిటేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు.అప్పట్లో నార్మల్ స్కూల్ టైమింగ్స్ మాదిరిగానే తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి తమ్ముడి పేరు చెప్పి బెదిరిస్తున్నారంటున్న మహిళ.. వీడియో వైరల్‌
Advertisement

తాజా వార్తలు