వైసీపీది భ‌య‌మా లేక జాగ్ర‌త్త‌నా.. ఇప్పుడే ఎందుకింత హ‌డావుడి..?

ఏపీ రాజకీయాల‌ను చూస్తుంటే అస‌లు వైసీపీ ముందు ఇంకో ప‌దేండ్ల‌యినా ఎవ్వ‌రైనా పోటీకి నిల‌బ‌డుతారా అనే ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు.

ఇందుకు నిద‌ర్శ‌నంగా వైసీపీ గ‌త 2019ఎన్నిక‌ల్లో సాధించిన సంచ‌ల‌న విజ‌యంతో పాటు ఆ త‌ర్వాత జ‌రుగుతున్న అన్ని ఎన్నిక‌ల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తేనే అర్థం అవుతుంది.

వ‌రుస బెట్టి అన్ని ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీని సంపాదించింది.ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ప్ర‌జ‌లు మాత్రం వైసీపీకే జై కొడుతున్నారు.

దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఇంకో రెండున్న‌రేండ్ల త‌ర్వాత కూడా వైసీపీకే బంప‌ర్ మెజార్టీతో ప‌ట్టం క‌ట్టే ఛాన్స్ ఉంది.అయినా కూడా జ‌గ‌న్ ఎందుకో జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇంకా చెప్పాలంటే కొంచెం భ‌యం కూడా ఉన్న‌ట్టు ఉంది.అందుకే మ‌ల్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇంతే మెజార్టీతో గెలిచేందుకు ఏకంగా వచ్చే ఏడాది ప్రశాంత్ కిషోర్ టీమ్‌ను రంగంలోకి దింప‌బోతున్నారు.

Advertisement
Ycp Is Scared Or Careful Why Are You Running Now Ycp, Ap Politics,ap News -వ�

ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని టీడీపీకి మద్దతిచ్చే మీడియా విప‌రీతంగా ప్రచారం చేయ‌డాన్ని చూస్తుంటే నిప్పు లేనిదే పొగ రాదు క‌దా అనే సామెత గుర్తుకు రాక మాన‌దేమో.కాగా కొందరు వైసీపీ నేతలు మాత్రం త‌మ‌కు ఇప్పుడు పీకే టీమ్ అవసరం లేదని, త‌మ‌కు ఉన్న ఆద‌ర‌ణే త‌మ‌ను మ‌ళ్లీ బంప‌ర్ మెజార్టీతో గెలిపిస్తుంద‌ని చెబుతున్నారు.

Ycp Is Scared Or Careful Why Are You Running Now Ycp, Ap Politics,ap News

కానీ జ‌గ‌న్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్రస్థాయిలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని పార్టీ పరిస్థితులపై స‌ర్వేలు కూడా చేయిస్తున్నారంట‌.కొంద‌రి మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను బ‌ట్టి పీకే టీం సహకారం త‌ప్ప‌నిస‌రి జగన్ డిసైడ్ అయిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది.కానీ ఇప్పుడు జగన్ ప్ర‌భుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల‌ను చూస్తుంటే ఇంకో రెండేండ్లు అయినా కూడా ఆ పార్టీకి ఇదే స్థాయిలో తిరుగులేని మెజార్టీ వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రెండున్న‌రేండ్ల త‌ర్వాత వ‌చ్చిన స్థానికసంస్థ‌ల ఎన్నికల్లో తిరుగులేని విజ‌యం ద‌క్కిందంటేనే విష‌యం అర్థం అవుతోంది.కానీ జ‌గ‌న్ మాత్రం వీటిని లెక్క చేయ‌కుండా ఎందుకైనా మంచిద‌ని పీకే స‌హ‌కారం తీసుకుంటున్నారంట‌.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు