హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen )నటించిన లైలా ( Laila )సినిమాని బాయ్ కాట్( Boycott ) చేయాలి అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఒక హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.సుమారు లక్షకు పైగా ట్వీట్లు చేస్తూ ఈ సినిమాపై భారీ స్థాయిలో నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.
అలాగే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే HD ప్రింట్ కూడా బయటకు రిలీజ్ చేస్తామని పోస్టులు పెడుతున్నారు అయితే ఈ విషయంపై హీరో విశ్వక్ ఎంతో ఎమోషనల్ అవుతూ ప్రెస్ మీట్ పెట్టి అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో విశ్వక్ తప్పు లేకపోయినా కమెడియన్ పృథ్విరాజ్( Pruthvi Raj ) చేసిన కామెంట్లు కారణంగా వైసీపీ అభిమానులు ఈ స్థాయిలో ఈ సినిమాపై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.
అయితే ఈ వివాదం గురించి పెద్ద ఎత్తున పలువురు రాజకీయ విశ్లేషకులు సినీ పెద్దలు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇలా వైయస్సార్సీపీ అభిమానులు సినిమాని బాయ్ కాట్ చేస్తాము అని చెప్పటం ఏమాత్రం కరెక్ట్ కాదని తెలిపారు.
అదేవిధంగా కమెడీయన్ పృథ్వీరాజ్ ఒక సినిమా వేదికకు వచ్చి రాజకీయాల( Politics ) గురించి మాట్లాడుతూ పరోక్షంగా ఒక పార్టీపై విమర్శలు చేయడం కూడా సరికాదని తెలిపారు.

సినిమాలు వేరు రాజకీయం వేరు సినిమాలలో ఉండే ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాలలో కొనసాగుతూ ఉంటారు.అలాంటప్పుడు రాజకీయాల గురించి విమర్శిస్తే వారు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా స్పందించాలి తప్ప సినిమా వేదికను రాజకీయాలకు అడ్డాగా మార్చుకొని మాట్లాడటం తప్పని విశ్లేషకులు వారి అభిప్రాయాలను తెలియజేశారు.

గతంలో పృథ్వీరాజ్ వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ను ఆయన సినిమాలను విమర్శించారు ఇప్పుడు ఆయన జనసేనలోకి రావడంతో వైసీపీని విమర్శిస్తున్నారు.అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా సినిమాని బాయ్కాట్ చేస్తామని చెప్పడం తప్పు అని ఇలా చేయటం వల్ల నష్టపోయేది పృథ్విరాజ్ కాదు సినిమా నిర్మాత నష్టపోతారని చెప్పాలి.ఇలాంటి విషయంపై సినీ పెద్దలు సరైన నిర్ణయం తీసుకోవాలని, రాజకీయాలలో ఉండే ఏ సెలబ్రిటీ అయినా సినిమా వేడుకలలో రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని లేకపోతే ఎన్నో సినిమాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని సినీ రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.







